Kaizer News

నిడమనూరులో ఘనంగా బోనాల పండుగ

నిడమనూరులో ఘనంగా బోనాల పండుగ

· State - Telangana · ntnews.com

నిడమనూరు, ఆగస్టు 29 : నిడమనూరు మండల కేంద్రంలో శ్రావణమాసం సందర్భంగా బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరుపుకున్నారు. శనివారం సాయంత్రం మహిళలు మేళ తాళాల నడుమ బోనాలతో ఊరేగింపుగా తరలివచ్చి గ్రామ దేవత ముత్యాలమ్మ ఆలయం చుట్టూరా ప్రదక్షిణలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పించారు. తమను చల్లంగా చూడాలంటూ వేడుకుని మొక్కులు చెల్లించారు. సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి యాటలను బలిచ్చారు. బోనాల సమర్పణ సందర్భంగా ముత్యాలమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో శేషరాజ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బొల్లం బాలయ్య, ఉన్నం శ్రీను, మన్నెం శంకర్, కోమటి వెంకన్న, మాచర్ల దాసు, నల్లబోతు వెంకటేశ్వర్లు, అలుగుబెల్లి వెంకట్ రెడ్డి, ఉన్నం ఈశ్వర్ ప్రసాద్, శేషరాజు దాసు, చంచల శ్రీకాంత్, ఉన్నం ఉషా కిరణ్, పోలేపల్లి యాదగిరి, వెంపటి పుల్లయ్య పాల్గొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News