Shorts ఆసిఫాబాద్: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కుటుంబ సభ్యుల ఆదరణకు దూరమై, తనను కుమారుడు పట్టించుకోవడం లేదంటూ కలెక్టరేట్‌ను ఆశ్రయించిన వృద్ధుడికి జిల్లా కలెక్టర్ కె. హరిత అండగా నిలిచారు. కాగజ్‌నగర్ మండలం బోడేపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య అనే వృద్ధుడు సెప్టెంబర్ 18న తన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ కె. హరిత వెంటనే స్పందించి వృద్ధుడిని స్వయంగా కలిసి ఆయన పరిస్థితి, కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకున్నారు. అవసరమైన రక్షణ, వసతి కల్పించేలా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న మల్లయ్య కుమారుడు స్పందించి, ఇకపై తన తండ్రి బాధ్యతలను పూర్తిగా తానే చూసుకుంటానని అధికారులకు హామీ ఇచ్చారు. దీంతో కలెక్టర్ చొరవతో కుమారుడు తన తండ్రిని తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉండే అవకాశం రావడంతో మల్లయ్య సంతోషం వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు కుటుంబ సభ్యుల అండ, ఆప్యాయత, భద్రత ఎంతో అవసరమని కలెక్టర్ కె. హరిత తెలిపారు. వృద్ధుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ వారి గౌరవం, భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు