Kaizer News

ఆర్టీసీకి ప్రభుత్వ బాకీ 3,785 కోట్లు!.. ఉచిత ప్రయా

ఆర్టీసీకి ప్రభుత్వ బాకీ 3,785 కోట్లు!.. ఉచిత ప్రయాణానికి ఖర్చయ్యే డబ్బులే విడుదల

· State - Telangana · ntnews.com

అదీ రూ.8,599.55 కోట్లు మాత్రమే చెల్లింపు ఆర్టీసీ ఖర్చులు, రుణాలకు రూపాయి విదల్చని సర్కార్‌ 2022 నాటికి అన్ని బకాయిలు చెల్లించిన బీఆర్‌ఎస్‌ మూడేండ్లలో బకాయి రూ.1,834.34 కోట్లు మసిబూసి మారేడుకాయ చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీ దివాలా తీసేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఎందుకంటే ప్రజా రవాణా సంస్థకు కేవలం మహాలక్ష్మి ఉచిత పథకం ద్వారా చెల్లించాల్సిన డబ్బులే దాదాపు రూ.3,785 కోట్లు వరకు ఉన్నాయని ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటివరకు అప్పులు, రుణాలు, చెల్లించాల్సిన బకాయిల విషయంలో ఎప్పటికప్పుడు మసిబూసి మారేడుకాయ చేస్తున్న ప్రభుత్వం.. అసెంబ్లీ సాక్షిగానైనా చెల్లించాల్సిన బకాయిల గుట్టు విప్పింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటినుంచి కేవలం మహాలక్ష్మి ఉచితబస్సు ప్రయాణానికి సంబంధించిన బకాయిలే విడుదల చేస్తున్నది తప్పా.. ఆర్టీసీకి చెల్లించాల్సిన పెండింగ్‌ బకాయిలు, రుణాల డబ్బులు ఇవ్వకపోవడంతో సంస్థ దివాళా తీసే స్థితికి వచ్చిందని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇచ్చిన సమాధానంలో 2024 ఆర్థిక సంవత్సరం నుంచి 2026-27 ఆర్థిక సంవత్సరం వరకు సుమారు రూ.1,834 కోట్లను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సి ఉన్నదని తేల్చారు. అయితే, వీటికి 2023 డిసెంబర్‌ నుంచి అమలు చేసిన ఉచిత ప్రయాణం జీరో టికెట్ల డబ్బులు కలిపితే మొత్తం రూ.3,785 కోట్లకు పైగానే ఉంటుందని ఆర్టీసీ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నెల 17న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. ఈ ప్రయాణాలతో మన ఆడబిడ్డలకు రూ.12,385 కోట్ల మేర ఖర్చు ఆదా అయింది’ అని చెప్పారు. అయితే, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణానికి కేవలం రూ.10,433.89 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించింది. అందులో కేవలం రూ.8,599.55 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అంటే మహాలక్ష్మి పథకానికి సంబంధించి చెల్లించాల్సినవే ఇంకా సుమారు రూ.3,785 కోట్లకు పైగానే ఉంటుందని స్పష్టంగా అర్థమవుతున్నది. ఆర్టీసీకి చెల్లించాల్సిన బాకీలపై మీడియా ప్రతినిధులు ఎప్పుడు ప్రశ్నించినా.. ఆర్టీసీ యాజమాన్యం, రవాణాశాఖ మంత్రి తప్పించుకునే ధోరణే ప్రదర్శిస్తున్నారు. అసెంబ్లీ పుణ్యమా అని ఆ లెక్కల బాగోతం బయటపడిందని కార్మికులు అంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో డాంబికాలకు పోతున్నదనడానికి ఇప్పటివరకు ఎగ్గొట్టిన డబ్బులే నిదర్శనం. ప్రభుత్వం కేటాయించిన డబ్బులు కూడా పూర్తిగా విడుదల చేయకపోవడంతో ప్రతినెలా ఆర్టీసీ ఉన్నతాధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2024-25 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.4,334.45 కోట్లు కేటాయిస్తే.. అందులో విడుదల చేసింది కేవలం రూ.3,866.30 కోట్లు. 2025-26 బడ్జెట్‌లో రూ.4,305.49 కోట్లు కేటాయిస్తే.. విడుదల చేసింది రూ.3,850.40 కోట్లు మాత్రమే. ఇక 2026-27(2026 ఆగస్టు 31 వరకు) కేటాయించిన బడ్జెట్‌

Original source: ntnews.com
Read more on Kaizer News