Mahabubabad: విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు,రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడం కోసం మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని తెలంగాణ మోడల్ స్కూల్ లో ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. పాఠశాల లోని 6 నుంచి 10 వ తరగతి చదివే విద్యార్థులకు ఓటు హక్కును కల్పించారు. వారికి నచ్చిన అభ్యర్థులను బ్యాలెట్ ద్వారా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ అసెంబ్లీ , పార్లమెంట్ , స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగానే నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ పేరు మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు విద్యార్థులపై నే ఆధారపడి ఉందని , విద్యార్థులకు రాజకీయ చైతన్యం కలిగించినట్లయితే వారు పెరిగి పెద్దవారై మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న వారిని ఎన్నికల్లో ఎన్నుకుంటారని ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు సాధారణ ఎన్నికలు ఏవిధంగా జరుగుతాయో ఆవిధంగా నిర్వహించామని తెలిపారు