Kaizer News

నిరుద్యోగ యువతకు తీపికబురు చెప్పిన ఉడాన్!

నిరుద్యోగ యువతకు తీపికబురు చెప్పిన ఉడాన్!

· State - Telangana · telugu.oneindia.com

తెలంగాణా రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు తెలంగాణా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే యువతకు కావాల్సిన స్కిల్స్ నేర్పించటానికి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. పలు కంపెనీలను తెలంగాణాకు ఆహ్వానించటం మాత్రమే కాక, యువతను కూడా ఉద్యోగాల కోసం తీర్చిదిద్దే పనిలో ఉంది. తెలంగాణ యువతకు శుభవార్త. రాష్ట్రంలోని యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం మరో ముఖ్యమైన అడుగు వేసింది. మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, డెల్ టెక్నాలజీస్ మధ్య 'ఉడాన్' కార్యక్రమం కోసం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 25 శిక్షణ కేంద్రాల్లో 5,500 మంది విద్యార్థులకు మూడు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుత సమాజంలో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి తోడు యువతకు శిక్షణ అవసరమని తెలంగాణా ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, డిజిటల్ స్కిల్స్ వంటి అంశాలపై యువతకు శిక్షణ అందించి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ఐఐటీ ఢిల్లీ రూపొందించిన కరిక్యులం ప్రకారం శిక్షణ సాగనుంది. డెల్ టెక్నాలజీస్ అవసరమైన సాంకేతిక మద్దతు అందిస్తుంది. కేవలం శిక్షణ ఇచ్చి వదిలేయడం కాకుండా, విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్, ఉద్యోగ నైపుణ్యాలు, అప్రెంటిస్‌షిప్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవకాశాలపై కూడా యువతకు అవగాహన కల్పిస్తారు. గ్రామీణ ప్రాంతాల యువతకు కూడా ఈ భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలు అందేలా కార్యక్రమాన్ని విస్తరిస్తున్నారు. యూట్యూబర్ వైష్ణవి భర్త హత్యకేసులో కీలక పరిణామం! ఎడ్యుకేషన్ నుంచి నైపుణ్యాల అభివృద్ధి వరకు, స్కిల్లింగ్ నుంచి ఎంప్లాయ్‌మెంట్ దిశగా యువతను తీసుకెళ్లే వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశంగా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తెలిపారు. శిక్షణ పొందినవారి సంఖ్యను పెంచడం కాదు, వారికి నిజంగా ఉద్యోగ అవకాశాలు దక్కేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. యువత భవిష్యత్‌కు ఇది మంచి అవకాశంగా మారాలని అందరూ ఆశిస్తున్నారు

Original source: telugu.oneindia.com
Read more on Kaizer News