Shorts చేర్యాల: చేర్యాల లో ఈరోజు యూనియన్ బ్యాంక్ 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ జోనల్ హెడ్ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జోనల్ హెడ్ శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ బ్యాంకు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రైతులు, వ్యాపారులు బ్యాంకు ద్వారా అందుబాటులో ఉన్న వివిధ రకాల రుణాలు, పథకాలు మరియు ఇతర బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా వివిధ రకాల పంటలు సాగు చేయడంతో పాటు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. రైతుల కోసం బ్యాంకులో అనేక రకాల రుణ సదుపాయాలు, పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), అటల్ పెన్షన్ యోజన (APY) వంటి సామాజిక భద్రతా పథకాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం ప్రతి కుటుంబం ఈ పథకాల గురించి తెలుసుకుని అర్హత మేరకు ఉపయోగించుకోవాలని సూచించారు. వ్యాపారులు కూడా తమ వ్యాపార అభివృద్ధికి బ్యాంకు అందించే రుణాలు, ఆర్థిక సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 14 సంవత్సరాలుగా ఖాతాదారులకు సేవలందిస్తున్న యూనియన్ బ్యాంక్... భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు కృషి చేస్తుందని అధికారులు తెలిపారు