Kaizer News

Amalapuram: మెగాస్టార్ చేతుల మీదుగా అవార్డు అందుకు

Amalapuram: మెగాస్టార్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సూదా వెంకటేష్

· State - Telangana · hmtvlive.com

Shorts అమలాపురం: పద్మవిభూషణ్,మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'మెగా యూత్ ఫోర్స్' ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సేవా,సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత విజయవంత మయ్యాయి.ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ITC కోహినూర్ 7 స్టార్ హోటల్‌లో ప్రత్యేక అభినందన సభను ఏర్పాటు చేశారు.​ ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పాల్గొని, అనేక కార్యక్రమాల విజయవంతానికి కృషి చేసిన ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించి అవార్డులను అందజేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్ సూదా వెంకటేష్ (చిన్నా) మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ​ఈ కార్యక్రమంలో మెగా యూత్ ఫోర్స్ అధ్యక్షురాలు కొణిదెల సుస్మిత , జాతీయ కన్వీనర్ ఏడిద బాబి తో పాటు పలువురు ముఖ్య నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా సూదా వెంకటేష్ (చిన్నా) మాట్లాడుతూ,మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని,ఆయన ఆశయాలకు అనుగుణంగా సమాజ సేవలో మెగా యూత్ ఫోర్స్ ఎల్లప్పుడూ ముందుంటుందని చిన్న తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News