> Smriti Mandhana : భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. ఆదివారం ఆసియా క్రీడల్లో భాగంగా బంగ్లాదేశ్‌తో సెమీస్ మ్యాచ్‌లో 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె ఈ ఘనతను అందుకుంది. ఈక్రమంలో ఆమె న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్‌ను అధిగమించింది. 186 మ్యాచ్‌ల్లో బేట్స్ 4758 పరుగులు చేయగా మంధాన కేవలం 178 మ్యాచ్‌ల్లోనే ఆమెను అధిగమించింది. Shreyanka Patil : జపాన్‌లో భారత మహిళా క్రికెటర్.. శ్రేయాంక పాటిల్ ఫోటోలు వైరల్.. ఈ మ్యాచ్‌లో మంధాన 19 బంతులు ఎదుర్కొంది. 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేసింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మతో కలిసి తొలి వికెట్‌కు 72 పరుగులు జోడించింది. * స్మృతి మంధాన (భారత్) – 178 మ్యాచ్‌ల్లో 4788 పరుగులు * సుజీ బేట్స్ (న్యూజిలాండ్) – 186 మ్యాచ్‌ల్లో 4758 పరుగులు * హర్మన్ ప్రీత్ కౌర్ (భారత్) – 209 మ్యాచ్‌ల్లో 4287 పరుగులు * చమరి ఆటపట్టు (శ్రీలంక) – 172 మ్యాచ్‌ల్లో 4282 పరుగులు * సోఫీ డివైన్ (న్యూజిలాండ్) – 158 మ్యాచ్‌ల్లో 3817 పరుగులు