మేషం... ఆర్థిక ఇబ్బందులు అధిగమించి అడుగు ముందుకేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు మిత్రులతో పంచుకుంటారు. ఆసక్తికర సమాచారం నిరుద్యోగులను ఉత్సాహపరుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం ఉండవచ్చు. సోదరులు అన్నిటా∙సహాయం అందిస్తారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వచ్చి ఊరట లభిస్తుంది. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలించి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో హోదాలు, బాధ్యతలు పెరుగుతాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు.. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నలుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి. వృషభం... బంధువులు, మిత్రుల సహకారంతో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. అనుకోనిరీతిలో∙ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు దక్కవచ్చు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో మానసిక అశాంతి. అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. మిథునం... కొత్త కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యాచరణలో పెడతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. కొన్ని ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. బంధువులతో సంబంధబాంధవ్యాలు మెరుగుపడతాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో అదనపు విధులు చేపట్టాల్సి వస్తుంది. పారిశ్రామికవర్గాలకు అన్నింటా అనుకూలమే. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. విష్ణుధ్యానం చేయండి. కర్కాటకం... ఎంతటి కార్యక్రమమైనా వేగవంతంగా పూర్తి చేస్తారు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. ప్రముఖులు పరిచయమవుతారు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు అనుకోని పదవులు రావచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి. సింహం... కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉన్నా అవసరాలకు లోటు రాకుండా గడుపుతారు. సన్నిహితులతో వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. భూములు కొనుగోలులో అవాంతరాలు అధిగమిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు విజయాల బాటలో పయనిస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. ముఖ్య వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలో అయిష్టంగానే కొన్ని మార్పులకు అంగీకరించక తప్పదు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం