‘మూడేళ్లుగా ఈ సినిమాతో ప్రయాణం చేస్తున్నా. అద్భుతమైన అవుట్‌పుట్ వచ్చింది. ఈ సినిమా విజయంపై టీమంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’ అని చెప్పారు సుమంత్. ఆయన కథానాయకుడిగా నటించిన డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’ సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్, కలిపు మధు నిర్మిస్తున్నారు. శనివారం దర్శకుడు వెంకీ అట్లూరి అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ను విడుదల చేశారు