Kaizer News

Cooking Time: వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో వంట

Cooking Time: వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో వంట చేయడానికి ఎంత టైం పడుతుందో తెలుసా?

· National - India · hmtvlive.com

Shorts Cooking Time: "ఈరోజు వంటలో ఏం చేయాలి?" అనే సాధారణ ప్రశ్న భారతీయులకు ఒక పెద్ద చిక్కు ప్రశ్నలా మారుతోంది. ఈ చిన్న నిర్ణయం తీసుకోవడానికి ఎంతో మంది గంటల తరబడి ఆలోచిస్తూ ఉంటారు. మన దేశంలో వంట చేయడం అనేది కేవలం ఒక సాధారణ రోజువారీ అవసరం మాత్రమే కాదు, గంటల కొద్దీ సాగే పెద్ద పనైపోయింది. ఇటీవలి కాలంలో వెలువడిన కొన్ని ఆసక్తికరమైన గణాంకాలను పరిశీలిస్తే భారతదేశంలో వంట పనులకు ప్రజలు ఎంత సమయం కేటాయిస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది. తాజా సర్వేల ప్రకారం.. భారతదేశంలో వంట చేసేవారు రోజువారీగా దాదాపు 200 నిమిషాలు (సుమారు 3 గంటల 20 నిమిషాలు) కేవలం వంట పనులకే వెచ్చిస్తున్నారు. అయితే ఈ భారం ఎక్కువగా మహిళల పైనే పడుతున్నట్లు స్పష్టమవుతోంది. భారతీయ మహిళలు రోజుకు దాదాపు 209 నిమిషాలు (సుమారు 3 గంటల 29 నిమిషాలు) వంట చేయడానికి ఖర్చు చేస్తున్నారు. అదే సమయంలో పురుషుల సగటు సమయం కేవలం 87 నిమిషాలు (1 గంట 27 నిమిషాలు) మాత్రమే ఉండటం గమనార్హం. ఇక కుటుంబాల్లో వంట పనుల భాగస్వామ్యాన్ని పరిశీలిస్తే, కేవలం 41 శాతం మంది మాత్రమే ఏదో ఒక రూపంలో వంట పనుల్లో భాగం అవుతున్నారు. ఇందులోనూ మహిళల భాగస్వామ్యం ఏకంగా 76.3 శాతంగా ఉండగా, పురుషుల భాగస్వామ్యం కేవలం 6.2 శాతం మాత్రమే ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు రోజుకు 212 నిమిషాలు, పట్టణ ప్రాంతాల్లో 202 నిమిషాలు వంటగదిలోనే గడుపుతున్నారు. కూరగాయలు తరగడం, పిండి కలపడం, వంట చేయడం, ఆ తర్వాత బేసిన్లు కడగడం వంటి పనులన్నీ ఒకరిపైనే పడటంతో ఈ సమయం మరింత పెరుగుతోంది. అదే సమయంలో ఇతర దేశాలతో పోలిస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. అమెరికాలో వంట చేయడానికి, ఆ తర్వాత శుభ్రం చేయడానికి కేవలం 43 నిమిషాలు మాత్రమే పడుతుంది. చైనాలో ఇంటి పనుల కోసం సగటున 1 గంట 59 నిమిషాలు వెచ్చిస్తున్నారు. ఇక రష్యాలో వంట, శుభ్రం చేయడానికి దాదాపు 177 నిమిషాలు పడుతోంది. ఏది ఏమైనప్పటికీ మన దేశంలో గృహ నిర్మాణ శైలి, సాంప్రదాయ వంటకాల పద్ధతుల వల్ల వంటగది పనులు మహిళలకు పెద్ద బాధ్యతగా మారుతున్నాయి. 2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది

Original source: hmtvlive.com
Read more on Kaizer News