Kaizer News

మల్కాజిగిరి: బాగానే ఉన్నాడన్నరు.. శవంగా పంపించారు

మల్కాజిగిరి: బాగానే ఉన్నాడన్నరు.. శవంగా పంపించారు

· State - Telangana · v6velugu.com

మల్కాజిగిరి, వెలుగు: ప్రమాదంలో గాయపడి మల్కాజిగిరి ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరిన ఓ వ్యక్తి చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు దవాఖాన ఎదుట ఆందోళనకు దిగారు. హాస్పిటల్​లో అడ్మిట్​చేసేప్పుడు తలకు దెబ్బ తాకినా.. పెద్దగా ప్రమాదం లేదని చెప్పారన్నారు. మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని అన్నారని, కానీ ఇప్పుడు చనిపోయాడని అంటున్నారని ఆరోపించారు. తమ దగ్గర రూ.4 లక్షల వరకు ఫీజు వసూలు చేసి శవంగా పంపించారని ఆవేదన చెందారు. చంద్రబాబు కాలనీకి చెందిన రాజు ఆదివారం బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నుంచి పడడంతో గాయపడ్డాడు. దీంతో అతడిని ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్చారు. రాజు ఆరోగ్యం 80 శాతం బాగుందని చెప్పారని, శుక్రవారం ఉదయం చనిపోయాడని సమాచారం ఇచ్చారన్నారు. పరిస్థితి బాగా లేదని తమకు ముందే చెప్తే పెద్ద హాస్పిటల్​కు తీసుకువెళ్లేవాళ్లమని పేర్కొన్నారు. చికిత్స పేరుతో డబ్బులు వసూలు చేసి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారని ఆరోపించారు. కాగా, ఈ ఘటనపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. డాక్టర్లు, నిర్వాహకులు అందుబాటులోకి రాలేదు

Original source: v6velugu.com
Read more on Kaizer News