Kaizer News

Amalapuram: నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి

Amalapuram: నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి: వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా

· State - Telangana · hmtvlive.com

అమలాపురం: నిత్యవసర సరుకులు పై అధిక ధరలను నియంత్రించాలి రాష్ట్ర వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు దేవాదుల సూర్యనారాయణమూర్తి. ప్రస్తుతం రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలు అధికంగా పెరిగినయని,బియ్యం,పంచదార పప్పు దినుసులు,వంట నూనె ఉల్లిపాయలు, వంటి నిత్యవసర వస్తువులు అధిక ధరలతో సామాన్యులకు అందుబాటులో లేకుండా ఉంటోందని. ప్రత్యేక కారణాలు ఏమి లేవు అంటూ ప్రకృతి సహకరించడం లేదని, వీటితో అధిక ధరలు పెంచుతూ సామాన్యులు నడ్డి విరుస్తోందని, ఇలాగే అధిక ధరలు కొనసాగితే ప్రజల యొక్క జీవనోపాధి ఏ విధంగా ఉంటుందో తెలియని పరిస్థితిలు ఏర్పాటుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. సామాన్యులకు కూటమి ప్రభుత్వము ఆదాయాన్ని పెంచలేకపోయినదని. ఈ అధిక ధరలతో బ్లాక్ మార్కెట్ నడుస్తోందని,అధిక ధరలపై కూటమి ప్రభుత్వము ధరలపై నియంత్రించే విధానంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఇదే ధరలు ఇలాగే కొనసాగితే వచ్చే పండుగ సీజన్లలో అధిక ధరలు మరిన్ని పునరావతం కాకుండా చూడవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది కాబట్టి వీటి పై భారం సామాన్యులపై పడుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ధరలపై ప్రత్యేక దృష్టి చాలించాలని డిమాండ్ చేశారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News