Kaizer News

వీరికి మేలు చేయడానికి కదిలి వస్తున్న భారీ గ్రహాలు.

వీరికి మేలు చేయడానికి కదిలి వస్తున్న భారీ గ్రహాలు.. ఈ రాశుల అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు

· State - Telangana · tv9telugu.com

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. వచ్చే నెలలో ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు గ్రహాలు సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు తమ స్థానాన్ని మార్చుకోబోతున్నాయి. దీని వలన మహా సంచారం జరగబోతోంది. ఇంకా అలాగే సెప్టెంబర్ లో రెండు రాశులకు వాళ్ళు కూడా అసలు ఉహించలేని అదృష్టాన్ని తీసుకురానుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. కన్య రాశి : కొద్దీ రోజుల్లో వీరి అదృష్టం డబుల్ అవుతుంది. ఇల్లు లేదా కారు కొనుగోలు చేస్తారు. అంతేకాదు, మీ సొంతూరులో భూమి కూడా కొంటారు. కొత్త ఉద్యోగం కూడా వస్తుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు రావడంతో మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషపడతారు. అంతేకాదు, సమాజంలో వీరి గౌరవ పెరుగుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే సమయం తులా రాశి : మీరు మొదలు పెట్టిన పనులకు ఎలాంటి అడ్డంకులు రావు. ఇంకా వీళ్ళు చేసే అన్ని పనుల్లో ఆ దేవుడు అనుగ్రహం ఉంటుంది. డబ్బు కూడా విపరీతంగా సంపాదిస్తారు. ఆర్థిక పరిస్థితుల నుంచి బయట పడతారు. కుటుంబం సభ్యులతో దేవాలయాలకు వెళ్తారు. మీరు ఈ సమయంలో చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. అసాధ్యం అనుకున్న పనులు చేసి చూపిస్తారు. Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Original source: tv9telugu.com
Read more on Kaizer News