సమాజ అభ్యున్నతి గురువులతోనే సాధ్యం: ఎస్సీటీ రాష్ట్ర చైర్మన్ సాయిని ప్రసాద్ నేత జన్నారం, ఆంధ్రప్రభ : విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులకే సాధ్యమని ఎస్సీటీ రాష్ట్ర చైర్మన్ సాయిని ప్రసాద్ నేత అన్నారు. జిల్లా, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న వారిని ఆదివారం స్థానిక జ్యోతి ఫంక్షన్ హాల్‌లో శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అభ్యున్నతి గురువులతోనే సాధ్యమన్నారు. విలువలతో కూడిన విద్యను అందిస్తూ ఉపాధ్యాయులు తమ శక్తివంచన లేకుండా ఉత్తమ సేవలు అందిస్తున్నారని, ఈ ప్రాంత విద్యాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నేతకాని కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాళ్లపల్లి రాజేశ్వర్, అవార్డు గ్రహీతలు బోర్లకుంట రాజయ్య నేత, శంకర్, బాదావత్ ప్రకాశ్ నాయక్, దుర్గం భూమన్న, జాడి రాజలింగం, నేతకాని కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బోర్లకుంట ప్రభుదాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జాడి గంగాధర్, ఎస్సీటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, మండల అధ్యక్షుడు రత్నం లక్ష్మణ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జాడి వెంకటయ్య, నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి దుర్గం వినోద్, సీనియర్ నాయకులు జనుగురి మల్లయ్య, అల్లూరి వినోద్ తదితరులు పాల్గొన్నారు