Kaizer News

Gudur: నారాయణమ్మ చిత్రపటానికి మాజీ ఎంపీ మాలోత్ కవి

Gudur: నారాయణమ్మ చిత్రపటానికి మాజీ ఎంపీ మాలోత్ కవిత నివాళి

· State - Telangana · hmtvlive.com

Shorts గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ముక్క లక్ష్మణరావు గారి తల్లి ముక్క నారాయణమ్మ ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత మాలోత్, ప్రముఖ నాయకురాలు హరిత కటికనేని బొద్దుగొండ గ్రామంలోని ముక్క లక్ష్మణరావు నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు ముక్క నారాయణమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పార్కల శ్రీనివాస్ రెడ్డి, రావుల రవిచందర్ రెడ్డి, ముత్యం వెంకన్న గౌడ్, మహబూబ్ పాషా, గజ్జి యాకయ్యతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News