సౌదీపై హౌతీల దాడులు.. రియాద్‌లో వరుస పేలుళ్లు.. ఆకాశంలో క్షిపణులు, డ్రోన్ల కలకలం. పరిస్థితి అంతకంతకూ ఉద్రిక్తంగా మారుతున్న వేళ తుర్కియే సంచలన ప్రకటన చేసింది. సౌదీకి అవసరమైన సైనిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అంకారా స్పష్టం చేసింది. ఇప్పటికే పాకిస్తాన్‌తో కలిసి సౌదీతో రక్షణ ఒప్పందం చేసుకున్న తుర్కియే ఇప్పుడు సైనిక-సాంకేతిక సాయం చేస్తామని ప్రకటించడం పశ్చిమాసియాలో కొత్త టెన్షన్‌కు తెరలేపింది. హౌతీల దాడులు మరింత పెరిగితే ఈ రక్షణ కూటమి ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతుందా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. కాగా, యెమెన్ హౌతీల వరుస క్షిపణి, డ్రోన్ దాడులతో సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. సౌదీకి అవసరమైన సైనిక సహాయం అందించేందుకు తుర్కియే సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ ప్రకటించారు. ముఖ్యంగా సైనిక సాంకేతిక అవసరాలను తీర్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ పరిణామం ఇటీవల తుర్కియే, సౌదీ, పాకిస్తాన్ మధ్య కుదిరిన మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై మరోసారి దృష్టిని మళ్లించింది. సౌదీ రాజధాని రియాద్ సహా పలు ప్రాంతాలపై హౌతీలు దాడులు చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం రియాద్‌లోని కీలక ప్రాంతాలను క్షిపణులు, డ్రోన్లతో లక్ష్యంగా చేసుకున్నట్లు హౌతీలు వెల్లడించారు. ఇదే సమయంలో నగరంలోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మంటలు, భారీగా పొగ కనిపించింది. సౌదీ అధికారులు రియాద్ వైపు వచ్చిన బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్నట్లు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాణనష్టం జరిగినట్లు వెల్లడించలేదు. అయితే, హౌతీల దాడులు కేవలం రాజధాని రియాద్‌కు మాత్రమే పరిమితం కావడం లేదు. ఇంధన మౌలిక వసతులు, నగరాలు, సముద్ర రవాణా మార్గాలపైనా దాడుల ముప్పు పెరిగింది. దీంతో ప్రపంచ చమురు సరఫరా, ఎర్ర సముద్ర వాణిజ్య మార్గాలపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విమానాశ్రయం వద్ద ఏం జరిగింది? రియాద్ విమానాశ్రయం సమీపంలో భారీగా పొగ కనిపించడంతో పాటు మంటలు కూడా చెలరేగిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మంటలు ఇంధన నిల్వ ప్రాంతానికి సమీపంలో కనిపించినట్లు రాయిటర్స్ దృశ్యాలు తెలిపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కొన్ని విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు నివేదికలు పేర్కొన్నాయి. దాడుల హెచ్చరికల నేపథ్యంలో సౌదీ అధికారులు రియాద్, అల్-ఖర్జ్ ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం పరిస్థితి అదుపులోకి రావడంతో ‘ఆల్ క్లియర్’ ప్రకటించారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో రియాద్‌లో ఈ స్థాయిలో వైమానిక దాడి హెచ్చరికలు రావడం ఇదే తొలిసారి అని నివేదికలు చెబుతున్నాయి. తుర్కియే కీలక ప్రకటన.. ఈ పరిస్థితుల్లో తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సౌదీ అరేబియా ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వంపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. సౌదీకి కొన్ని సైనిక అవసరాలు, ముఖ్యంగా సాంకేతిక రంగంలో అవసరాలు ఉండొచ్చని.. వాటిని తీర్చేందుకు తుర్కియే సిద్ధంగా ఉందని చెప్పారు. అంటే వెంటనే తుర్కియే సైన్యాన్ని యెమెన్‌లోకి పంపుతామన