Kaizer News

తల్లిని చంపి.. మృతదేహంపై బిడ్డను వదిలేశారు

తల్లిని చంపి.. మృతదేహంపై బిడ్డను వదిలేశారు

· National - India · sakshi.com

రాయచూరు రూరల్‌: కర్ణాటకలో అత్యంత హృదయ విదారకమైన ఘోరం వెలుగుచూసింది. పొలంలో ఓ వివాహిత హత్యకు గురికాగా మృతదేహంపై చిన్నారి విలపిస్తోంది. తన తల్లి ఎందుకు అలా పడి ఉందో తెలియక, పాల కోసం రోదిస్తూ ఉంది. రాయచూరు జిల్లా సింధనూరు తాలూకాలో ఆర్‌హెచ్‌ క్యాంపు సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతురాలిని స్నేహ అమిత్‌ (26)గా గుర్తించారు. ఏడాదిన్నర కుమార్తె మేఘనను మృతదేహంపై పడుకోబెట్టి హంతకులు పరారయ్యారు. బాలిక ఏడుపుతో హత్య వెలుగులోకి వచ్చింది. స్నేహ తల, గొంతులో కత్తితో పొడిచి చంపినట్లు ఆనవాళ్లున్నాయి. సింధనూరు గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ సీఐ వినాయక్, డీఎస్పీ చంద్రశేఖర్‌ నాయక్‌ ఘటనాస్థలిని పరిశీలించారు. స్నేహకు అమిత్‌ అనే యువకుడితో 3 ఏళ్ల కిందట పెళ్లయినట్లు తెలుస్తోంది. అమిత్‌తో పాటు ఆమె స్నేహితుడు శుభం అనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరు ఉత్తరాది నుంచి కూలి పనుల కోసం వలస వచ్చారని సమాచారం. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News