Amalapuram | అమలాపుం, ఆంధ్రప్రభ : అమలాపురంలోని మహిపాల వీధిలో ఇవాళ తెల్లవారుజామున భారీ పేలుడు కలకలం రేపింది. ఓ ఇంట్లో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల భవనాలు సైతం కంపించాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఓ వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు, డీఎస్పీ ప్రసాద్ కూడా ఘటనాస్థలిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది