సాక్షి, హైదరాబాద్: నగరంలోని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై హోంగార్డ్ దాడి చేసిన ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా హోంగార్డ్ ఆనంద్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఉద్యోగం నుంచి తొలగించిన అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు వీడియోను రిలీజ్ చేశారు. వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మహిళపై సదరు హోంగార్డు విచక్షణారహితంగా దాడి చేశాడు. తనతో వాగ్వాదానికి దిగడంతో మహిళపై హోంగార్డు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కాగా, అతడు హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌లో డిప్యూటేషన్‌పై అతడు విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఘటన అనంతరం హోంగార్డును తిరిగి తెలంగాణ పోలీస్ శాఖకు రైల్వే అధికారులు పంపించేశారు. అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సైతం తెలిపారు. డీజీపీ సీరియస్.. మరోవైపు ఈ ఘటనపై డీజీపీ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు. వెంటనే హోంగార్డ్ ఆనంద్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది ఏ స్థాయి వారైనా.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఇలాంటి ప్రవర్తనను క్షమించలేమన్నారు. ఇది శిక్షణ, ఆదేశాలకు విరుద్ధమని తెలిపారు. మహిళ పట్ల హోంగార్డు ప్రవర్తన ఖండించదగినదని డీజీపీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఈ ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండ్ కేటీఆర్ కూడా స్పందించారు. ఎక్స్ వేదికగా కేటీఆర్.. పోలీసుల ప్రవర్తన అత్యంత దారుణంగా ఉందని మండిపడ్డారు. డీజీపీ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వీడియోను కూడా కేటీఆర్ షేర్ చేశారు. నెల్లూరులో భారీ వర్షం...నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్ జంట సందడి (ఫొటోలు) మార్కెట్లోకి ఐఫోన్ 18 ఎంట్రీ...స్టోర్స్ ముందు క్యూ కట్టిన ఫ్యాన్స్ (ఫొటోలు) లడ్డూ నెయ్యి వివాదంలో కీలక ట్విస్ట్.. జంతు కొవ్వుపై దర్యాప్తులో క్లారిటీ ది ప్యారడైజ్ సెన్సార్ రిపోర్ట్ ఇదే.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..! కమలమ్మ పార్థివ దేహనికి విజయమ్మ, అవినాష్ రెడ్డి నివాళులు