Kaizer News

Bodhan: సోయాబీన్‌లో ఫెరోమోన్ ట్రాప్స్‌పై అవగాహన: వ

Bodhan: సోయాబీన్‌లో ఫెరోమోన్ ట్రాప్స్‌పై అవగాహన: వ్యవసాయ విద్యార్థులు

· State - Telangana · hmtvlive.com

Shorts Bodhan: బోధన్ నియోజకవర్గం సాలురా మండలం ఖాజపూర్ లో గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమం (RAWE)లో భాగంగా జగిత్యాల వ్యవసాయ కళాశాల విద్యార్థులు సోయాబీన్ పంట ల పై రైతులకు ఫెరోమోన్ ట్రాప్స్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం విద్యార్థులు ఫెరోమోన్ ట్రాప్స్ యొక్క ప్రాముఖ్యత, పని విధానం, పొలంలో ఏర్పాటు చేసే విధానం మరియు వాటిని పర్యవేక్షించే పద్ధతులను రైతులకు క్లుప్తంగా వివరించారు. ఫెరోమోన్ ట్రాప్స్ ద్వారా కొన్ని పంటలకు హానికలిగించే కీటకాల మగ పురుగులను ఆకర్షించి పట్టుకోవడం ద్వారా కీటకాల ఉనికిని ముందుగానే గుర్తించి, వాటి ఉధృతిని పర్యవేక్షించవచ్చని తెలిపారు. విద్యార్థులు సోయాబీన్ పొలంలో తగిన ప్రదేశాల్లో ఫెరోమోన్ ట్రాప్స్‌ను ఏర్పాటు చేసి, వాటిని క్రమం తప్పకుండా పరిశీలించాలని రైతులకు సూచించారు. కీటకాల ఉధృతి పెరిగినప్పుడు మాత్రమే అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అనవసరమైన పురుగుమందుల వినియోగాన్ని తగ్గించవచ్చని వివరించారు. ఫెరోమోన్ ట్రాప్స్ పర్యావరణహితమైన సమగ్ర సస్యరక్షణ (IPM) పద్ధతుల్లో ఒకటని, వీటి వినియోగం ద్వారా కీటకాల పర్యవేక్షణ, పురుగుమందుల ఖర్చు తగ్గింపు మరియు పంట రక్షణలో ప్రయోజనం ఉంటుందని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో RAWE విద్యార్థులు, రైతులు పాల్గొని ఫెరోమోన్ ట్రాప్స్ ఏర్పాటు మరియు వినియోగంపై ప్రాయోగిక అవగాహన కల్పించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News