Kaizer News

దసరాకు రానున్న వెంకటేష్, త్రివిక్రమ్ ఏకే 47 !

దసరాకు రానున్న వెంకటేష్, త్రివిక్రమ్ ఏకే 47 !

· Entertainment · v6velugu.com

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ (ఏకే 47). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఇందులోని ఒక్కొక్కరి పాత్రలను పరిచయం చేశారు మేకర్స్. అలాగే అక్టోబర్ 2న సినిమా విడుదల అని ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం అనుకున్న తేదీకి రావడం కష్టమేనని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌‌లో బెస్ట్ క్వాలిటీ ఇచ్చేందుకు మేకర్స్ మరికొంత సమయం తీసుకుంటున్నారని, దీనికోసం సినిమాను మరో రెండు వారాలు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ 16న ‘ఏకే 47’ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దసరా సెలవులను టార్గెట్‌‌గా చేసుకుని ఈ కొత్త రిలీజ్ డేట్‌‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. యువినా పార్థవి, రాజా ప్రజ్వల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు

Original source: v6velugu.com
Read more on Kaizer News