Shorts Bheemili: భీమిలి KGBVలో విద్యార్థుల జుట్టు కత్తిరింపు ఘటనపై ప్రిన్సిపాల్ వివరణ. బుధవారం రాత్రి జరిగిన ఘటన మరుసటి రోజు తమ దృష్టికి వచ్చింది. వెంటనే విద్యార్థులందరినీ అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం, విద్యార్థులను పలుమార్లు అడిగినా జుట్టు ఎవరు కత్తిరించారో చెప్పలేదు. బయట వ్యక్తులు డార్మిటరీలోకి వచ్చే అవకాశం లేదు. నైట్ డ్యూటీ సిబ్బందిని కూడా విచారించాము రాత్రి 10 గంటల వరకు నైట్ స్టడీ అవర్ ఉంటుంది.. ఆ తర్వాత విద్యార్థులు నిద్ర పోతారు. తెల్లవారుజామున 4 గంటలకు మళ్లీ విద్యార్థులను స్టడీ అవర్‌కు లేపుతాము, 9వ తరగతి విద్యార్థులు నిద్రించే డార్మిటరీలోనే ఘటన జరిగినట్లు గుర్తించాం. రెండు గదుల్లో కలిపి పలువురు విద్యార్థుల జుట్టు కత్తిరించారని అనుకుంటున్నాం ఒకే రాత్రి పలువురి జుట్టు కత్తిరించడంతో.. విద్యార్థుల్లో ఎవరో సహకరించి ఉండొచ్చన్న అనుమానం. డార్మిటరీ లోపల CCTV కెమెరాలు లేవు. ఎంట్రన్స్, కారిడార్‌లో మాత్రమే CCTV కెమెరాలు ఉన్నాయి. ఘటనపై విద్యార్థుల నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాం