వందల గణేశమంటపాల్లో శ్రీనివాస్ ‘ గౌరీపుత్ర నమస్తేస్తు ‘ హైదరాబాద్, ఆంధ్రప్రభ : భాద్రపదమాస ప్రారంభ వేళ మారేడు , తంగేడు , బంతి , చామంతుల మధ్య అరవిరిసిన కలువ పువ్వులా ప్రముఖ రచయిత , అద్భుత వక్త పురాణపండ శ్రీనివాస్ ప్రత్యేక రీతిలో రూపుదిద్దిన అమోఘ రచనా సంకలనం ”గౌరీపుత్ర నమస్తేస్తు” అత్యంత ఆకర్షణీయంగా పవిత్రంగా దర్శనమిస్తోందని జంట నగరాల్లోని పలువురు ప్రముఖులు అభిప్రాయాల్ని ప్రశంసలుగా వర్షించడం అభినందనీయం. కొన్ని స్తోత్రాల పరిమళాలు, ఇంకొన్ని వ్యాఖ్యానాల సొగసులు, మరికొన్ని ప్రాచీన గణపతులు విశేషాల వైభవాలు, వేదాది గ్రంధాల్లోని గణేశోపాసనలు… ఇలా పరమ వైదిక బద్ధంగా ఈ అనిర్వచనీయ అనుభూతుల గ్రంధాన్ని రూపకల్పన చేసి, అద్భుత వ్యాఖ్యానాలు అందించిన శ్రీనివాస్ అద్భుత శైలీ విన్యాసాన్ని పలువురు కవులు, రచయితేలే కాకుండా రసజ్ఞులు, పాఠకులు సైతం అభినందనలు ప్రవాహంలా పొంగించడం సంభ్రమాశ్చర్యకరమని రవీంద్రభారతికి విచ్చేసిన సాహితీవేత్తలు చర్చించుకోవడం మీడియా కంటబడటం విశేషం. మరొక ఎత్తు ముద్రణలోని మహాసౌందర్య నైపుణ్యమని చెప్పకతప్పదని రామకృష్ణమఠం, శంకరమఠం ప్రముఖులు సైతం వేనోళ్ళ కొనియాడుతున్నారు. వందల గణేశమంటపాల్లో జంటనగరాల్లో ఈ గ్రంధమే దర్శమివ్వడమే కాకుండా ఖైరతాబాద్ మహా గణేశా ప్రతిమకు మొదటి రెండు రోజులు విచ్చేసిన అతుదులకు కూడా పురాపందా శ్రీనివాస్ ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ మంగళ శబ్దాల పవిత్ర వెతికాను నిర్వాహకులే స్వయంగా అందజేశారు. ఎక్కడా కొంచం కూడా వాపారాత్మక సొగసులు లేకుండా ఎంతో పరమ పవిత్రంగా వేల పాఠకుల మనస్సుల్లి కొల్లగొట్టిన ఈ పవిత్ర గణేశ గ్రంధం జంటనగరాల్లోనే కాకుండా తెలంగాణాలోని వరంగల్, యాదాద్రి, కరీంనగర్ , జగిత్యాల, బాసర, వేములవాడ వంటి నగరాల్లో సంచలనం సృష్టించడమే కాకుండా పలువురు బీజేపీ, ఆరెస్సెస్ శ్రేణుల చేత ఎంతోమందికి వితరణ చేయించబడ్డ గ్రంధంగా కూడా నగరాల సిగలో శాంతుల్ని, కాంతుల్ని విరజిమ్మిందనే చెప్పాలి. ఈ గ్రంథ రామణీయకత, కమనీయత, పవిత్రతల వెనుక పురాణపండ శ్రీనివాస్ తీసుకున్న శ్రద్ధ , రాసిన శైలి, నిస్వార్ధ సేవకు గణపతి భగవానుని అనుగ్రహం పుష్కలంగా ఉందనేది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి, హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ, ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖామంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, కిమ్స్ వైద్య సంస్థ ఫౌండర్ బొల్లినేని కృష్ణయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య , ఆంధ్రప్రదేశ్ శాసనమండలి శాసన సభ్యులు బొత్స సత్యనారాయణ , జె.జె హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ జయంతీరెడ్డి, డాక్టర్ జయరామిరెడ్డి వంటి ఎందరో ప్రముఖులు సమర్పకులుగా వ్యవహరించిన ఈ విలక్షణ వినాయక విశేష సంచిక సుమారు వంద పేజీలతో ఈ గణపతి నవరాత్రులలో అందడానికి పురాణపండ శ్రీనివాస్ ఎంత కష్టపడ్డారో ప్రతీ పేజీలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని యాదాద్రి దేవస్థానం ప్రధాన అర్చకులు నల్లంతీగల్ లక్ష్మీ నరసింహా చార్యులు పురాణపండ శ్రీనివాస్ ను ప్రత్యేకంగా మంగళాశాసనాలు చేయడం సంభ్రమాశ్చర్యకరం. సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి , ఆర్కే రోజా , తనికెళ్ళ భరణి , యాంకర్ సుమ వంటి ప్రముఖులే కాకుండా రాజకీయ ప్రమ