మా బాబు వయసు మూడున్నరేళ్లు. సరిగ్గా తినడం లేదు. కొంచెం తిన్న వెంటనే ఇక చాలు అంటున్నాడు. అందుకే, వయసుకు తగ్గట్టు ఎత్తు, బరువు పెరగడం లేదు అనుకుంటున్నాను. మా అబ్బాయి బాగా తినాలంటే ఏం చేయాలి? – రమణి, హైదరాబాద్. పి ల్లల విషయంలో అసలు ప్రశ్న ‘ఎంత తిన్నాడు?’ అనేది కాదు ‘ఏం తిన్నాడు?’ అనేదే. పిల్లల కడుపు నిండితే సరిపోదు. మెదడు ఎదగాలి, ఎముకలు బలపడాలి, కండరాలు పెరగాలి, రోగనిరోధక శక్తి మెరుగవ్వాలి! పిల్లల పెరుగుదలకు క్యాలరీల కంటే క్వాలిటీ న్యూట్రిషన్ ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం గురించి ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు.. మెదడుకు ‘ఫ్యూయల్’ కావాలి! పిల్లల జీవితంలోని తొలి సంవత్సరాలు మెదడు అభివృద్ధికి ఎంతో కీలకం. ఈ సమయంలో ప్రొటీన్ , ఐరన్ , జింక్, అయోడిన్ , ఒమేగా–3 ఫ్యాటీ ఆసిడ్స్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు అందేలా చూడాలి. ఐరన్ ఎంతో ముఖ్యమైనది! ఐరన్ తక్కువైతే రక్తహీనత మాత్రమే కాదు, ఏకాగ్రత, చురుకుదనం తగ్గి, నేర్చుకునే సామర్థ్యం ప్రభావితం కావచ్చు. అందుకే పప్పులు, ఆకుకూరలు, గుడ్డు, మాంసాహారం, రాగి వంటివి పిల్లల భోజనంలో చేర్చాలి. ఐరన్ ఉన్న ఆహారంతో పాటు నిమ్మ, జామ, ఉసిరి వంటి విటమిన్ –సి ఉన్న పదార్థాలు ఇస్తే ఐరన్ శరీరంలోకి బాగా చేరుతుంది. ప్రొటీన్ ఎదుగుదలకు బిల్డింగ్ బ్లాక్స్! ‘బాబు బాగా తింటున్నాడు’ అనడం కంటే ‘బాబుకు రోజూ మంచి ప్రొటీన్ అందుతోందా?’ అని ఆలోచించండి. గుడ్డు, పాలు, పెరుగు, పప్పులు, శనగలు, పెసలు, చేపలు, మాంసం వంటివన్నీ పిల్లల ఎదుగుదలకు మంచి ప్రొటీన్ వనరులు. బలమైన ఎముకలకు పాలు! పాలు మంచివే. కానీ ఎముకల బలానికి పాలు ఒక్కటే సరిపోవు. కాల్షియం, విటమిన్ –డి, శారీరక చలనం కూడా అవసరం. పాలు, పెరుగు, రాగి, నువ్వులు, పనీర్ వంటి వాటి ద్వారా కాల్షియం అందుతుంది. వైద్యుల సూచన మేరకు అవసరమైతే మందుల ద్వారా కూడా తీసుకోవటం ఉత్తమం. జింక్ కొంచెమే... ఫలితమే ఘనం జింక్ పిల్లల ఎదుగుదలకు, కణాల అభివృద్ధికి, రోగనిరోధకతకు సహాయపడుతుంది. పప్పులు, గింజలు, నువ్వులు, గుడ్లు, చేపలు, మాంసాహారం వంటి వాటిలో జింక్ లభిస్తుంది. విటమిన్ –ఏ అంటే క్యారెట్ మాత్రమేనా? కాదు. విటమిన్ –ఏ కళ్ల ఆరోగ్యంతో పాటు రోగనిరోధక శక్తికి కూడా ముఖ్యమైనది. క్యారెట్‌తో పాటు గుమ్మడికాయ, ఆకుకూరలు, మామిడి, బొప్పాయి వంటి రంగురంగుల పండ్లు, కూరగాయలను పిల్లల ఆహారంలో చేర్చాలి. పిల్లల ప్లేట్‌లో రంగులు పెరిగితే, పోషకాల్లో కూడా వైవిధ్యం పెరుగుతుంది. ఒమేగా–3 ఎందుకు అవసరం? ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు, కళ్ల అభివృద్ధికి ఉపయోగపడతాయి. చేపలు దీనికి మంచి వనరులు. శాకాహారంలో అవిసె గింజలు, చియా గింజలు, వాల్‌నట్స్ వంటి వాటి ద్వారా కూడా ఇవి లభిస్తాయి. అయితే చిన్నపిల్లలకు గింజలు, నట్స్ ఇస్తున్నప్పుడు వయసుకు తగినట్లు సురక్షిత రూపంలోనే ఇవ్వాలి. పిల్లల ప్లేట్‌కి ‘5 కలర్స్’ చాలెంజ్! పిల్లల ప్లేట్‌లో పసుపు రంగులో ధాన్యం అన్నం, రొట్టె, రాగి, జొన్న; ఆకుపచ్చ రంగులో కూరగాయలు, ఆకుకూరలు; ఎరుపు రంగులో పప్పు, గుడ్డు, చేప, మాంసం; నారింజ రంగులో పండు; తెలుపు రంగులో పాలు, పెరుగు ఉండేలా ప్రయత్నించండి. వివిధ రకాల ఆహారాలను కలిపి