Kaizer News

Asian Games 2026: భారత్‌ ఖాతాలో రెండో పతకం

Asian Games 2026: భారత్‌ ఖాతాలో రెండో పతకం

· National - India · sakshi.com

ఏషియన్‌ గేమ్స్‌ 2026లో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగుతోంది. తొలి రోజే షూటింగ్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో ఎలావెనిల్‌ వలరివన్‌ రజతం సాధించింది. దీంతో ఈ ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య రెండుకు చేరింది. ఇప్పటికే సోనమ్‌ మస్కర్‌, విదర్సా వినోద్‌తో కలిసి మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో రజతం గెలిచిన ఎలావెనిల్‌.. వ్యక్తిగత విభాగంలోనూ సత్తా చాటింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య జరిగిన ఫైనల్లో రాణించి మరోసారి పోడియంపై నిలిచింది. మరో పతకం ఖాయం షూటింగ్‌లో రెండు రజత పతకాలు కైవసం చేసుకున్న భారత్‌.. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎంఎంఏ)లోనూ మరో పతకం ఖాయం చేసుకుంది. మహిళల సంప్రదాయ 60 కేజీల విభాగం క్వార్టర్‌ ఫైనల్లో మంగోలియా క్రీడాకారిణి ఆల్టాంచిమెగ్‌ బైగల్మాను ఓడించిన సుచికా తరియాల్‌ సెమీఫైనల్‌కు చేరింది. దీంతో భారత్‌కు ఈ క్రీడలో తొలి పతకం ఖాయమైంది. తొలి రోజు భారత అథ్లెట్ల ఫలితాలు వుషు: పురుషుల చాంగ్‌క్వాన్‌ ఫైనల్లో సూరజ్‌ సింగ్‌ మయాంగ్లంబం 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. టెక్‌బాల్‌: మహిళల సింగిల్స్‌ కాంస్య పతక పోరులో జపాన్‌ క్రీడాకారిణి యుయినా సకమోటో చేతిలో క్విమ్సీ డిసౌజా ఓడిపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ కాంస్య పతక పోరులోనూ క్విమ్సీ డిసౌజా, మహమ్మద్‌ అనస్‌ బేగ్‌ జోడీకి నిరాశ ఎదురైంది. వియత్నాం జోడీ చేతిలో ఓటమి పాలైంది. స్విమ్మింగ్‌: పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ హీట్స్‌లో రిషబ్‌ దాస్‌ ఐదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఉత్కర్ష్‌ పాటిల్‌ 12వ స్థానంలో నిలిచాడు. పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టైల్‌ హీట్స్‌లో బెనెడిక్షన్‌ బెనిస్టన్‌ 12వ స్థానంలో, ఆకాష్‌ మణి 23వ స్థానంలో నిలిచారు. టేబుల్‌ టెన్నిస్‌: మహిళల టీమ్‌ గ్రూప్‌ ఎఫ్‌ మ్యాచ్‌లో ఇండోనేషియాపై భారత్‌ 3-0తో విజయం సాధించింది. పురుషుల టీమ్‌ గ్రూప్‌ ఎఫ్‌ మ్యాచ్‌లోనూ భారత్‌ 3-0తో ఇండోనేషియాను ఓడించింది. ఎంఎంఏ: మహిళల సంప్రదాయ 60 కేజీల క్వార్టర్‌ ఫైనల్లో సుచికా తరియాల్‌ విజయం సాధించి భారత్‌కు పతకం ఖాయం చేసింది. హాకీ: ఉజ్బెకిస్థాన్‌తో జరిగిన పూల్‌ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 19-0తో ఘన విజయం సాధించింది. దీపికా సెహ్రావత్‌ ఏకంగా 9 గోల్స్‌ చేసి టోర్నీలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. మహిళల క్రికెట్‌: సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడుతోంది. ఫైనల్‌ బెర్త్‌ కోసం భారత జట్టు పోరాడుతోంది. ఇదీ చదవండి: Asian Games 2026: షూటింగ్‌ 'సిల్వర్‌'తో ఖాతా తెరిచిన భారత్‌ కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు) గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) ఫ్లైఓవర్ పై నుంచి పడిన BMW.. కారు తుక్కు తుక్కు టీమిండియాకు మరో తలనొప్పి.. ఆసియా గేమ్స్ లో నఖ్వీ ఎంట్రీ... వెయ్యేళ్ల ప్రళయం.. ముంచెత్తబోతున్న రాకాసి జలపాతం! కాకా కేక పెట్టిస్తాది..! విశ్వంభర గురించి చెప్పలేను

Original source: sakshi.com
Read more on Kaizer News