Kaizer News

Icchapuram: ఇచ్చాపురంలో ఘనంగా 'పీఎం స్వానిధి - లోక

Icchapuram: ఇచ్చాపురంలో ఘనంగా 'పీఎం స్వానిధి - లోక్ కళ్యాణ్ మేళా'!

· State - Telangana · hmtvlive.com

Shorts Icchapuram: చిరు వ్యాపారుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం స్వానిధి’ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎన్. రమేష్ పిలుపునిచ్చారు. మెప్మా ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో ‘పీఎం స్వానిధి - లోక్ కళ్యాణ్ మేళా’ను నిర్వహించారు. కమిషనర్ రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పట్టణ పరిధిలోని అర్హులైన వీధి విక్రయదారులందరికీ ఎలాంటి ఆలస్యం లేకుండా సకాలంలో రుణాలు, క్రెడిట్ కార్డులు మంజూరు చేయాలని బ్యాంకు మేనేజర్లను కోరారు. చిరు వ్యాపారుల జీవనోపాధిని మెరుగుపరచడంలో బ్యాంకుల సహకారం ఎంతో కీలకమన్నారు. అలాగే మంజూరైన రుణాల వాయిదాలు ప్రతి నెలా సక్రమంగా చెల్లించేలా మెప్మా సిబ్బంది, రిసోర్స్ పర్సన్లు (RP) క్షేత్రస్థాయిలో బాధ్యత తీసుకుని పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా టౌన్ మిషన్ కో-ఆర్డినేటర్ భాస్కరరావు, సీవోలు సంతోష్, బాలరాజు, డీఈవో శ్రీను, బ్యాంకు మేనేజర్లు అనిత పండా, సత్యనారాయణ, సంతోష్, ప్రియంబాత్ రాథోడ్‌తో పాటు మెప్మా ఆర్పీలు, వీధి వ్యాపారులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News