Kaizer News

శిలాఫలకమే మీది.. సంకల్పం, సమగ్ర నిర్మాణం వైఎస్సార్

శిలాఫలకమే మీది.. సంకల్పం, సమగ్ర నిర్మాణం వైఎస్సార్‌ది

· State - Telangana · sakshi.com

వెలిగొండలో చంద్రబాబు క్రెడిట్‌ చోరీపై వైఎస్‌ జగన్‌ ధ్వజం వెలిగొండకు ప్రాణం 37.587 కిలోమీటర్ల జంట సొరంగాలు కీలక జంట సొరంగాలు పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వానిదే ఇప్పుడు జరుగుతున్నది.. మీ క్రెడిట్‌ చోరీనే బాబూ మీరు, మీ అనుకూల మీడియా ఎంతగా చరిత్రను వక్రీకరించినా వాస్తవాలు మారవు ప్రచార ఆర్భాటాన్ని పక్కన పెట్టి.. నల్లమలసాగర్‌ను నింపి, రైతులకు సాగునీరు ఇవ్వాలి సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ చరిత్రను మార్చేలా కొన్నాళ్లుగా సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రచారం, ఎల్లో మీడియా చేస్తున్న హడావుడి.. క్రెడిట్‌ చోరీ యత్నాలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు చరిత్ర చాలా స్పష్టం.. శిలాఫలకం మాత్రమే మీది.. సంకల్పం, సమగ్ర నిర్మాణం వైఎస్సార్‌ గారిది.. కీలక జంట సొరంగాలు పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వానిది.. ఇప్పుడు జరుగుతున్నది మీ క్రెడిట్‌ చోరీ’ అంటూ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. మీరు, మీ అనుకూల మీడియా ఎంతగా చరిత్రను వక్రీకరించినా వాస్తవాలు మారవు.. మీ మీడియాలో మీకు భజన చేయించుకున్నంత మాత్రాన నిజాలను దాచలేరంటూ సీఎం చంద్రబాబుకు చురకలంటించారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రచార ఆర్భాటాన్ని పక్కన పెట్టి.. నల్లమలసాగర్‌ను నింపి.. రైతులకు సాగునీరు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాలకు రక్షిత మంచినీరు అందించాలని హితవు పలికారు. పెద్దదోర్నాల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. మార్కాపురం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని ప్రభుత్వ రంగంలో పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ తన ‘ఎక్స్‌’ ఖాతాలో వైఎస్‌ జగన్‌ ఆదివారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. నాన్న స్వప్నం సాకారం కావడం సంతోషంగా ఉంది.. నాన్నగారి స్వప్నమైన వెలిగొండ ప్రాజెక్టు సాకారం కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ మహాయజ్ఞంలో భాగస్వామిని కావడం.. మా ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన జంట సొరంగాలను పూర్తిచేసి జాతికి అంకితం చేయడం.. ఇవాళ వాటి ద్వారా కృష్ణా జలాలు ప్రవహించడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. రక్షిత మంచినీరు లేక ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్న లక్షలాది కుటుంబాలకు, సాగునీటి కోసం ఎదురు చూస్తున్న రైతులకు వెలిగొండ ఒక సంజీవని. కానీ వెలిగొండపై చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా చేస్తున్న హడావుడి చూస్తే ఆశ్చర్యమేస్తోంది. కొన్ని రోజులుగా చేస్తున్నవన్నీ వెలిగొండ నిర్మాణ చరిత్రను మార్చే పబ్లిసిటీ ఫీట్లు, క్రెడిట్‌ చోరీ ప్రయత్నాలే. చంద్రబాబు గారూ వెలిగొండ చరిత్ర చాలా స్పష్టం. శిలాఫలకం మాత్రమే మీది. సంకల్పం, సమగ్ర నిర్మాణం వైఎస్సార్‌ గారిది.. కీలక జంట సొరంగాల పూర్తి ఘనత మా ప్రభుత్వానిది.. ఇప్పుడు జరుగుతున్నది మీ క్రెడిట్‌ చోరీ. 1996 నుంచి 2004 వరకూ ఖర్చు చేసింది కేవలం రూ.పది లక్షలే.. అదీ శంకుస్థాపన, సభ ఏర్పాట్లకే.. చంద్రబాబు గారూ మీరు, మీ అనుకూల మీడియా ఎంతగా చరిత్రను వక్రీకరించినా వాస్తవాలు మారవు. మీ మీడియాలో మీకు భజన చేయించుకున్నంత మాత్రాన నిజాలను దాచలేరు. 1996లో హడావుడిగా, అప్పట్లో ఎన్నికల ముందు

Original source: sakshi.com
Read more on Kaizer News