Kaizer News

వికారాబాద్‌లో భారీ వర్షం

వికారాబాద్‌లో భారీ వర్షం

· State - Telangana · prabhanews.com

రైతుల్లో ఆనందం.. ప్రజల్లో ఉత్సాహం వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు పరిసర మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గత కొంతకాలంగా వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో వర్షం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఈ వర్షం ఊరటనిచ్చింది. ముఖ్యంగా పంటలు ఎండిపోతాయంటూ ఆందోళన చెందుతున్న రైతుల్లో ఆనందం నెలకొంది. మరోవైపు విద్యుత్‌ కోతలతో సతమతమవుతున్న ప్రజలకు కూడా వర్షం కొంత ఉపశమనం కలిగించింది. గత వారం రోజులుగా వర్షాలు లేకపోవడంతో నీటి ఎద్దడి ఏర్పడుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం కురిసిన వర్షం రైతుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. వర్షం కారణంగా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉండటంతో పాటు పంటలకు కూడా మేలు జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం వర్షం కురిసినట్లు సమాచారం

Original source: prabhanews.com
Read more on Kaizer News