Kaizer News

Kadiyam: కడియపులంకలో బీటీ రోడ్డుకు బదులు సీసీ రోడ్

Kadiyam: కడియపులంకలో బీటీ రోడ్డుకు బదులు సీసీ రోడ్డు నిర్మించాలి!

· State - Telangana · hmtvlive.com

Shorts Kadiyam: కడియం మండలం కడియపులంక గ్రామంలో నాబార్డ్ రోడ్డు నుండి సత్యదేవ నర్సరీ వరకు నూతనంగా నిర్మించే బీటీ రోడ్డును సీసీ రోడ్డుగా నిర్మించాలని కోరుతూ స్థానిక రైతులు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కలిసి వినతి పత్రం అందించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కడియం మండలంలో నర్సరీ రైతులు మొక్కలు ఎగుమతి చేసేందుకు భారీ వాహనాలు ప్రయాణించడం తనకు తెలుసునని, సాధ్యమైనంతవరకు అన్నిచోట్ల కోట్లాది రూపాయల కేటాయించి సిసి రోడ్లు నిర్మిస్తున్నామని, నర్సరీ రైతుల కోరుతున్న ఈ రోడ్డును కూడా సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సీసీ రోడ్డు నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, కడియం మండల జనసేన అధ్యక్షులు ముద్రగడ జమ్మి, గట్టి సుబ్బారావు, పాఠంశెట్టి రాంజీ, సత్తి వెంకటగిరి, బొరుసు శేషగిరి, పుల్ల ఆంజనేయులు, చెక్కపల్లి గోవింద్, మార్గాని కృష్ణ, పెనుమాక శ్రీను, పుల్ల పెద్ద సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News