Kaizer News

Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండలో జీవీ ఆంజనేయుల

Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండలో జీవీ ఆంజనేయులు కామెంట్స్!

· State - Telangana · hmtvlive.com

Shorts Vinukonda: వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్ స్కాం దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న అంశాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. రూ.3,200 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో అసలు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్లింది, ఎవరు లబ్ధి పొందారనే అంశాలు తేలాల్సి ఉందన్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, బ్రాండ్ల ఎంపిక, సరఫరా ఆర్డర్లు, చెల్లింపులు, ముడుపుల ఆరోపణలు తదితర ప్రతి అంశాన్ని దర్యాప్తు సంస్థలు లోతుగా పరిశీలించాలని కోరారు. SIT దర్యాప్తులో విధాన మార్పులు, సరఫరాదారులతో సంబంధాలు, కిక్‌బ్యాక్‌ల ఆరోపణలు, రాష్ట్ర ఖజానాకు నష్టం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయని తెలిపారు.మాజీ ప్రభుత్వ అధికారి సత్యప్రసాద్ వాంగ్మూలం, దర్యాప్తు సంస్థలు కోర్టుకు సమర్పించిన నివేదికల్లోని అంశాలపై కూడా వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉందన్నారు. అయితే వాంగ్మూలాల్లో ఎవరి పేర్లు వచ్చినా తుది నిజానిజాలు దర్యాప్తు, న్యాయస్థాన ప్రక్రియ ద్వారానే తేలుతాయని స్పష్టం చేశారు. లిక్కర్ కంపెనీల నుంచి ముడుపులు తీసుకుని కొన్ని బ్రాండ్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జీవీ అన్నారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ అయితే ఎంతటి వారైనా చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజా ధనానికి పూర్తి లెక్క చెప్పించి, అవినీతి, అక్రమ ఆర్థిక వ్యవహారాలకు అడ్డుకట్ట వేయాలని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News