Kaizer News

Illanthakunta: నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి బీటీఆర్ ఫౌ

Illanthakunta: నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి బీటీఆర్ ఫౌండేషన్ ఆర్థిక సాయం!

· State - Telangana · hmtvlive.com

ఇల్లంతకుంట: నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలుస్తూ బీటీఆర్ ఫౌండేషన్ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన తిప్పర్తి శంకరయ్య–దివంగత భాగ్యవ్వ దంపతుల కుమార్తె శ్రీలేఖ వివాహానికి రూ.10 వేల విలువైన టేక్ మంచాలను ఫౌండేషన్ తరఫున అందజేశారు. బీటీఆర్ (బెండ్రం తిరుపతిరెడ్డి) ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్నకుమార్ ఈ సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇల్లంతకుంట మండలంలోని నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు తమ ఫౌండేషన్ తరఫున ఎల్లప్పుడూ కళ్యాణ కానుకలు, అవసరమైన సహాయాన్ని అందిస్తామని తెలిపారు. పేద కుటుంబాలకు అండగా నిలవడం తమ ఫౌండేషన్ లక్ష్యమన్నారు. ఈ సేవా కార్యక్రమంలో సర్పంచ్ రడం లక్ష్మి ప్రవీణ్, పత్రి రమేష్, సింగిరెడ్డి ప్రతాప్ రెడ్డి, గజ్జల శ్రీనివాస్, దూది శ్రీనివాస్, పున్ని ప్రశాంత్, ఉప్పులేటి ప్రశాంత్, మహేందర్‌తో పాటు ఫౌండేషన్ ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News