Kaizer News

Amalapuram: అమలాపురంలో వినియోగదారుల సలహా కేంద్రం ప

Amalapuram: అమలాపురంలో వినియోగదారుల సలహా కేంద్రం ప్రారంభం!

· State - Telangana · hmtvlive.com

Shorts అమలాపురం: ఈ రోజు అమలాపురం పట్టణంలోని స్థానిక సుబ్బారాయుడు చెరువు చిల్డ్రన్స్ పార్క్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా వినియోగదారుల సలహా కేంద్రం"ను అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా హాజరై,రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ "వినియోగదారుల హక్కుల పరిరక్షణ మరియు వారి సమస్యల పరిష్కారంలో జిల్లా వినియోగదారుల సలహా కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది. నేటి కాలంలో వస్తువులు,సేవల కొనుగోలులో మోసపోకుండా వినియోగదారులలో సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వినియోగదారులు తమకు ఏదైనా అన్యాయం లేదా మోసం జరిగినప్పుడు ధైర్యంగా ఈ కేంద్రాన్ని ఆశ్రయించి ఉచితంగా సలహాలు,సూచనలు మరియు న్యాయమైన పరిష్కారాలు పొందవచ్చు" అని పేర్కొన్నారు. ప్రజలందరూ వినియోగదారుల చట్టాలపై అవగాహన పెంచుకుని, తమ హక్కులను కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల సంఘం ప్రతినిధులు, కూటమి ముఖ్య నాయకులు,అధికారులు మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News