టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యహరిస్తున్నాడు. రెగ్యులర్ సారధి ఇషాన్ కిషన్ గాయం కారణంగా మైదానం వీడడడంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న వైభవ్ జట్టు బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతడు తీసుకున్న ఒక సంచలన నిర్ణయం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. వైభవ్ అద్భుతమైన రివ్యూతో సెంట్రల్ జోన్ స్టార్ బ్యాటర్ ఆర్యన్ జుయల్‌ను పెవిలియన్‌కు పంపాడు. సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ తొలి బంతిని జుయల్‌కు ఔట్ సైట్ ఆఫ్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని ఆర్యన్ జుయల్ ఆఫ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌కు దగ్గరగా వెళ్తూ వికెట్ కీపర్ కుమార్ కుశాగ్ర చేతుల్లో పడింది. వెంటనే వికెట్ కీపర్‌తో పాటు ఈస్ట్ జోన్ ఆటగాళ్లు క్యాచ్‌కు అప్పీల్ చేశారు. అంపైర్ నాటౌట్ అంటూ తల ఊపాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ వైభవ్ మొదట రివ్యూ తీసుకోవాలా వద్దా అనే సందేహంలో పడ్డాడు. అయితే సహచర ఆటగాళ్లతో చర్చించి 3 సెకన్ల సమయం మాత్రమే మిగిలి ఉండగా వైభవ్ డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు. థర్డ్ అంపైర్ 'అల్ట్రాఎడ్జ్' పరిశీలించగా బంతి బ్యాట్‌ను తాకినట్లు స్పష్టమైన స్పైక్ కనిపించింది. దీంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అవుట్‌గా ప్రకటించాడు. 15 ఏళ్ల వయసులోనే కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ చూపించిన సమయస్ఫూర్తికి జట్టు సభ్యులంతా హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. చదవండి : బీసీసీఐ బిగ్ ప్లాన్.. ఇంగ్లండ్‌కు ‘కాశ్మీర్ ఎక్స్‌ప్రెస్’ ఆకిబ్ నబీ! హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) షూటింగ్ కోసం ఓనం మిస్.. ర్యాండమ్ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు