Kaizer News

నిప్పులు చెరిగిన నోర్జే

నిప్పులు చెరిగిన నోర్జే

· Sports · sakshi.com

యూరోపియన్‌ టీ20 ప్రీమియర్‌ లీగ్‌ 2026లో సౌతాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌ అన్రిచ్‌ నోర్జే చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో రోటర్‌డామ్ రాకర్స్‌కు ఆడుతున్న అతడు.. నిన్న బెల్‌ఫాస్ట్ వుల్వ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 11 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైనప్పటికీ.. నోర్జే ప్రదర్శన అసాధారణంగా అనిపించింది. నోర్జేకు టీ20 క్రికెట్‌లో ఇదే తొలి 5 వికెట్ల ప్రదర్శన. తన 173వ టీ20 మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెల్‌ఫాస్ట్ వుల్వ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం రోటర్‌డామ్ రాకర్స్ ఛేజింగ్ ప్రారంభించిన వెంటనే భారీ వర్షం మొదలవ్వడంతో కేవలం ఒక ఓవర్ ఆట మాత్రమే సాధ్యమైంది. దీంతో నిర్వహకులు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. మ్యాక్స్‌వెల్‌, కాన్వే సహా..! ఈ మ్యాచ్‌లో నోర్జే సాధించిన వికెట్లలో టాప్‌ బ్యాటర్లు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (7), డెవాన్‌ కాన్వే (41) ఉన్నారు. వీరితో పాటు టిమ్‌ టెక్టార్‌ (14), హ్యారీ మనెంటి (30), లోర్కన్‌ టకర్‌ (0)ను కూడా నోర్జే ఔట్‌ చేశాడు. ఈ ఐదు వికెట్లలో మ్యాక్స్‌వెల్‌ వికెట్‌ హైలైట్‌గా నిలిచింది. అతడిని నోర్జే అద్భుతమైన బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. బెల్‌ఫాస్ట్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌-4 బ్యాటర్లను నోర్జేనే ఔట్‌ చేయడం మరో విశేషం. కాగా, యూరోపియన్‌ టీ20 ప్రీమియర్‌ లీగ్‌ ఇదే సీజన్‌తో మొదలైన విషయం తెలిసిందే. ఈ టోర్నీలోని ఆరు ఫ్రాంచైజీలకు భారత, విదేశీ క్రికెటర్లు, సినీ సెలబ్రిటీలు యజమానులుగా ఉన్నారు. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం

Original source: sakshi.com
Read more on Kaizer News