భారతీయ సినిమా నుంచి ఆస్కార్ బరిలో నిలిచే చిత్రంపై ఉత్కంఠకు తెరపడింది. 33 సినిమాలతో పోటీపడిన మరాఠీ క్రైమ్ థ్రిల్లర్ ‘గోంధాల్’.. 99వ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి భారత్ అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. మరి ఈ సినిమా ప్రత్యేకత ఏంటి? ఆస్కార్ రేసులో నిలిచిన నాలుగు తెలుగు చిత్రాలేవి? రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’కు ఎన్ని ఓట్లు వచ్చాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల కోసం భారత్ నుంచి అధికారికంగా ఏ సినిమా వెళ్తుందనే ఆసక్తికి సమాధానం దొరికింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) శుక్రవారం ప్రకటించిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో రూపొందిన మరాఠీ క్రైమ్ థ్రిల్లర్ ‘గోంధాల్’ (Gondhal)ను భారత అధికారిక ఎంట్రీగా ఎంపిక చేశారు. సంతోష్ దావఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారత్ తరఫున పోటీపడనుంది. ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగే ఉత్కంఠభరిత సంఘటనలు, ప్రేమ, నమ్మకద్రోహం, స్వేచ్ఛ కోసం చేసే ప్రయత్నాలు ఈ కథలో కీలకంగా ఉంటాయి. అయితే ‘గోంధాల్’ ఎంపిక వెనుక 33 సినిమాల పోటీ ఉంది. ఆ జాబితాలో తెలుగు, హిందీ, మరాఠీ సహా పలు భాషల చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. ఆస్కార్ ఎంట్రీ కోసం మొత్తం 33 సినిమాలు పరిశీలనకు వచ్చాయి. ఇందులో హిందీ నుంచి 14 చిత్రాలు, మరాఠీ, తెలుగు, గుజరాతీ భాషల్లో నాలుగు చొప్పున సినిమాలు ఉన్నాయి. తమిళం నుంచి మూడు చిత్రాలు, మలయాళం, కొయాంక్ భాషల్లో ఒక్కో సినిమా పోటీపడ్డాయి. ఒక మూకీ చిత్రం కూడా ఈ జాబితాలో ఉంది. ఈ చిత్రాలను పరిశీలించిన జ్యూరీ సభ్యులు ఫైనల్గా కొన్ని సినిమాలను షార్ట్‌లిస్ట్ చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. ‘గోంధాల్’, ‘అంఘ్’, ‘మై వాపస్ ఆవుంగా’ వంటి చిత్రాలు తుది పరిశీలనలో ఉన్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇక చివరకు భారత అధికారిక ఎంట్రీగా ‘గోంధాల్’ను ఎంపిక చేసింది జ్యూరీ. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నాలుగు సినిమాలు ఆస్కార్ పరిశీలనకు పంపిన చిత్రాల జాబితాలో ఉన్నాయి. పెద్ద హీరోల సినిమాలతోపాటు ఇతర భాషా చిత్రాలు కూడా పోటీపడిన ఈ జాబితాలో తెలుగు సినిమాలకు చోటు దక్కడం ఆసక్తిని కలిగించింది. FFI (Film Federation of India) ప్రకారం తెలుగు చిత్రాలు: సింగీతం (Sing Geetham) పెద్ది (Peddi) ఇరుముడి (Irumudi) ఎగ్వా (Egwa) రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన ‘పెద్ది’, మరోవైపు రవితేజ ‘ఇరుముడి’ కూడా ఈ జాబితాలో చోటు సంపాదించింది. ‘సింగీతం’, ‘ఎగ్వా’ చిత్రాలు కూడా తెలుగు విభాగం నుంచి పరిశీలనకు వచ్చాయి. అయితే ఈ నాలుగు సినిమాల్లో ఏదీ భారత అధికారిక ఎంట్రీగా సెలెక్ట్ కాలేదు. అదేవిధంగా ‘హనుమాన్ అంశ్’, ‘బోర్డర్ 2’, ‘హక్’, ‘120 బహదూర్’, ‘ఇక్కిస్’, ‘ధురంధర్: ది రివెంజ్’ వంటి సినిమాలు కూడా పోటీలో నిలిచాయి. ఫైనల్గా.. మరాఠీ చిత్రం ‘గోంధాల్’ అవకాశం దక్కించుకుని టాక్ అఫ్ ది ఇండియాన్ సినిమాగా మారింది. ఆస్కార్ ఎంట్రీగా ఎంపికైన ‘గోంధాల్’ కథాంశం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహారాష్ట్ర గ్రామీణ నేపథ్యంలో ఒకే ఒక్క రాత్రిలో జరిగే సంఘటనల చుట్టూ సినిమా సాగుతుంది. మహారాష్ట్ర సంప్రదాయాల్లో భాగమైన ‘గోంధాల్’