ఆరోగ్యానికి అసలు మాత్ర ఆహారమే. అందుకే వంటిల్లే ఆరోగ్యాలయం అంటుంది సంప్రదాయ వైద్యం. అయితే వంటింట్లో అన్నీ వండి మాత్రమే తినాలా... వండకుండా కూడా పాకాన్ని చేయొచ్చా... అలా అయితే అది ఆరోగ్యదాయకం, ఆమోద యోగ్యమేనా... లాంటి అనేక ప్రశ్నలను లేవనెత్తి, వాటికి సమాధానాలూ చెబుతుంది ‘వంద వండని వంటలు’ పుస్తకం. ఇంకా చెప్పాలంటే పచ్చి కూరల్లోని పోషకాలు వండితే చచ్చిపోతాయనీ, అది జీవశక్తి లేని మృతాహారం కిందకి వస్తుందనీ, అసలైన అమృత ఆహారం వండని వంటలేననీ అంటారు రచయిత తుమ్మేటి రఘోత్తమ రెడ్డి