హరారే వేదికగా జింబాబ్వే-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డే అభిమానులను ఆఖరి వరకు మునివేళ్లపై నిలబెట్టింది. చివరి వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ ఉత్కంఠ పోరులో ఒక్క వికెట్ తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూలకు జింబాబ్వే బౌలర్లు చుక్కలు చూపించారు. జోష్ ఇంగ్లిస్ (103) సెంచరీతో కదం తొక్కినప్పటికీ, మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఆసీస్ కష్టాల్లో పడింది. ఒకానొక దశలో 232 పరుగులకే 8 వికెట్లు కోల్పోవడంతో ఆసీస్‌కు ఓటమి తప్పదని అంతా భావించారు. ఈ సమయంలో 9వ స్థానంలో క్రీజులోకి వచ్చిన పేసర్ నాథన్ ఎల్లిస్ (36 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. చివరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 9 పరుగులు అవసరం కాగా.. ఎల్లిస్ తొలి బంతికే సిక్స్ బాది విజయాన్ని ఖాయం చేశాడు. కాగా 49వ ఓవర్‌లో ఎల్లిస్ ఇచ్చిన క్యాచ్‌ను మధెవెరే జారవిడవడమే జింబాబ్వే ఓటమికి కారణమైంది. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 4 వికెట్లతో రాణించాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కెప్టెన్ సికందర్ రాజా (81 నాటౌట్), క్రైగ్ ఎర్విన్ (59), ఇన్నోసెంట్ కైయా (55) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు) కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్? గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్