Kaizer News

Kodumuru: కోడుమూరులో శ్రీలక్ష్మీ వేంకటేశ్వర ఆలయాన్

Kodumuru: కోడుమూరులో శ్రీలక్ష్మీ వేంకటేశ్వర ఆలయాన్ని పరిశీలించిన మంత్రి టీజీ భరత్

· State - Telangana · hmtvlive.com

Shorts కర్నూలు జిల్లా: కోడుమూరులో నూతనంగా నిర్మిస్తున్న హరిహర క్షేత్ర శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శినకు వచ్చిన మంత్రి టీజీ భరత్ ను ఆలయ కమిటీ వారు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనులను మంత్రి టీజీ భరత్ పరిశీలించారు. ఆలయంలో నిర్మిస్తున్న రాతి కట్టడాలు, ప్రాకారాల ప్రాధాన్యతను అడిగి తెలుసుకున్నారు ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి సహకారం అందించడంతో పాటు తన వంతు సహాయాన్ని కూడా అందిస్తానని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై ఆలయ కమిటీ ఛైర్మన్ ఎద్దుల మహేశ్వర రెడ్డి తో వివరాలు తెలుసుకున్నారు. కోడుమూరు అంటేనే ఆలయం గుర్తుకు వచ్చేలా ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉందని టీజీ భరత్ పేర్కొన్నారు. నూతన ఆలయ నిర్మాణం పూర్తయితే కోడుమూరు త్వరలోనే చారిత్రాత్మక ప్రదేశంగా మారుతుందని ఆయన అన్నారు. ఆలయల సుదర్శనం కోసం వచ్చినా మంత్రి టీజీ భరత్ ను కోడుమూరు ఆర్యవైశ్యులు శాలువా కప్పి సత్కరించారు.ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయాల కమిటీ ఛైర్మన్ ఎద్దుల మహేశ్వర రెడ్డి తో పాటు ఆర్యవైశ్యులు నాగరాజు , పట్నం సుధాకర్ ,యుగంధర్ తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News