Kaizer News

అంతర్‌ జిల్లా దొంగల అరెస్టు

· State - Telangana · sakshi.com

రాజానగరం: స్థానిక పోలీసు స్టేషను పరిధిలోని కోలమూరులో ఇద్దరు అంతర్‌ జిల్లా దొంగలు పోలీసులకు చిక్కారు. సీఐ వీరయ్యగౌడ్‌ శనివారం ఇక్కడ మీడియాకు తెలిపిన వివరాలిలావున్నాయి. గత నెల 23న కొంతమూరులోని ఓ ఇంటిలో జరిగిన చోరీపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, అనకాపల్లి, ఏలూరు జిల్లాలో వారిపై పలు కేసులు నమోదైన విషయం బయటపడింది. ఏలూరుకు చెందిన తురకా దుర్గారావు, విశాఖపట్నంలోని కంచరపాలేనికి చెందిన గుడిబోయిన ఉదయ్‌కిరణ్‌ కొంతమూరులో జరిగిన చోరీతో పాటు అనకాపల్లి మండలం గవరపాలెంలో మరో ఇంటిలో తాళాలు పగులగొట్టి దొంగతానికి పాల్పడ్డారు. వారి నుంచి 40 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి వస్తువులతో పాటు రెండు సెల్‌ఫోన్లు, రెండు వాచీలు, ఒక బైకును స్వాధీనం చేసుకున్నారు. దుర్గారావుపై ఏలూరు, కొయ్యలగూడెం, గాజువాక, విజయనగరం, విశాఖ–1 పోలీసు స్టేషన్లలో 13 కేసులు, ఉదయ్‌కిరణ్‌పై కంచరపాలెం పీఎస్‌లో రౌడీ షీడ్‌ ఉండటమే కాకుండా ఆ పీఎస్‌తో పాటు, గాజువాక, విశాఖ ప్రాంతాల్లో 8 కేసులు నమోదై ఉన్నాయి. పగలంతా రెక్కీ నిర్వహించి, రాత్రి వేళలలో ఇళ్లలో దొంగతనాలు చేస్తుంటారన్నారు. నిందితులిద్దరినీ రిమాండ్‌కు పంపించామని సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సై ప్రియకుమార్‌, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News