Kaizer News

రేవంత్‌కే షాకిచ్చిన ఎర్రవల్లి దళితులు

రేవంత్‌కే షాకిచ్చిన ఎర్రవల్లి దళితులు

· State - Telangana · ntnews.com

అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు వల్లెవేసిన ముఖ్యమంత్రి నువ్వు కాదు.. మేమెప్పుడో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టాం మేము ఎవర్నీ వదిలిపెట్టం: జగదీశ్‌రెడ్డి హెచ్చరిక సూర్యాపేట, సెప్టెంబర్‌ 18 (నమస్తే తెలంగాణ): ఎర్రవల్లిలోగల కేసీఆర్‌ నివాస పరిధిలోని భూములను లాక్కొని దళితులకు పంచుతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించి అధికారులను సర్వేకు పంపితే అక్కడి దళితులే ఎదురు తిరిగి ప్రభుత్వానికి షాక్‌ ఇచ్చారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి ఆడుతున్న డ్రా మాలతో ప్రజల్లో జోకర్‌గా నిలిచిపోయారని ఎద్దేవా చేశారు. ఎన్ని డ్రామాలు ఆడినా 22ఏ నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. శుక్రవారం సూర్యాపేటలో ని తన క్యాంపు కార్యాలయంలో జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమను అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్‌ చేసి.. ఇన్నిం గ్స్‌ ఆడుతున్నాను.. మరో ఇన్నింగ్స్‌ ఉందంటున్న రేవంత్‌కు అసలు విషయం తెలియడం లేదని అన్నారు. తామే ఎప్పుడో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టామని ఎవరినీ వది లి పెట్టబోమని హెచ్చరించారు. దమ్ముంటే తమను అసెంబ్లీకి అనుమతించి చర్చ పెట్టాలని డిమాండ్‌ చేశారు. అధికారులు నోటీసు లు ఇవ్వకుండా సర్వే పేరిట కేసీఆర్‌ నివా సం చుట్టూ తిరుగుతున్నారని, అయితే భూ ముల్లో తామే ఉన్నామని దళితులు చెప్పు తో కొట్టినట్టు చెప్పారని.. ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుంటే మంచిదని హితవు పలికారు. రేవంత్‌, ఆయన కుటుంబ సభ్యు లు విలువైన భూములను గుంజుకుంటున్నారని ఆరోపించారు. రకరకాల పేర్లతో తోడేళ్లలా జనాన్ని భయపెట్టి 30 నుంచి 40 శాతం భూములు లాగేసుకుంటూ దందా చేస్తున్నారని విమర్శించారు. రేవంత్‌ భూ బాగోతాలన్నీ బయట పెడుతామని హెచ్చరించారు

Original source: ntnews.com
Read more on Kaizer News