Kaizer News

మణికొండలో హైడ్రాకు మద్దతుగా భారీ ర్యాలీ

మణికొండలో హైడ్రాకు మద్దతుగా భారీ ర్యాలీ

· State - Telangana · v6velugu.com

గండిపేట,వెలుగు: చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు హైడ్రా చేపడుతున్న చర్యలకు మద్దతుగా మణికొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. మణికొండ మర్రిచెట్టు నుంచి ప్రారంభమైన ర్యాలీ పంచవటి కాలనీ మీదుగా హుడా కాలనీ వరకు సాగింది. కాంగ్రెస్ రాష్ట్ర మీడియా, కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ వాసిరెడ్డి నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో వివిధ కాలనీల అసోసియేషన్ ప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా హైడ్రా చేపడుతున్న చర్యలకు మద్దతుగా ప్రజలు నినాదాలు చేస్తూ తమ సంఘీభావాన్ని తెలిపారు. మన మణికొండ – మన బాధ్యత ప్రకృతి పరిరక్షణే మన బాధ్యత అంటూ ప్రజలు నినదించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ర్యాలీ నిర్వాహకులు పిలుపునిచ్చారు

Original source: v6velugu.com
Read more on Kaizer News