మన నిత్య జీవితంలో వంట గదిలో అత్యంత కీలకమైనది ఎల్పీజీ గ్యాస్ సిలిండర్. సిలిండర్ అయిపోవచ్చినప్పుడు లేదా కొత్త సిలిండర్ వచ్చినప్పుడు దానిని కదిలించినప్పుడు లోపల నీళ్లు కదులుతున్నట్లు శబ్దం రావడం మనం గమనించే ఉంటాం. దీంతో చాలామందికి ఒక పెద్ద సందేహం వస్తుంది.. పేరులోనే గ్యాస్ అని ఉన్నప్పుడు, సిలిండర్ లోపల ద్రవం ఎందుకు ఉంటుంది? ఎల్పీజీ సిలిండర్ లోపల ఉండేది వాయువా లేక ద్రవమా? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే