యర్రగొండపాలెం: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులపై చంద్రబాబు ప్రభుత్వం కనికరం చూపటంలేదని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రంగా విమర్శించారు. ఆయా గ్రామాల్లో విద్యుత్ కనెక్షన్లు తీసేయించారని, కనీసం తాగునీరు గ్రామాల్లోకి వెళ్లకుండా పోలీసులతో అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం మార్కాపురం జిల్లాలోని నిర్వాసిత గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. వెలిగొండ నిర్వాసితుల గోడు వర్ణనాతీతంగా ఉందని చెప్పారు. ప్రజలు కన్నీటి పర్యంతం అవుతున్నా.. రెవెన్యూ, పోలీసు అధికారులు కనికరం చూపడంలేదన్నారు. నిర్వాసిత గ్రామాలైన సుంకేశుల, కలనూతల, గుండంచెర్ల పంచాయతీల్లో నివాసితులైన వారికి ఇప్పటివరకు ఇంటి పట్టాలు ఇవ్వకుండా వారికి కేటాయించిన ప్లాట్ల నంబర్లు చెప్పకుండా, లేఅవుట్లలో రోడ్లకన్నా లోతు ఉన్న ప్లాట్లను మెరక చేయకుండా వారి జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నాడని ధ్వజమెత్తారు. నిర్వాసితుల పరిస్థితి చూస్తుంటే హృదయం ద్రవిస్తోందన్నారు. గెజిట్‌లో పేరున్న వారికి అవార్డు పాస్ చేయకుండా, ఆయా ప్రాంతాల్లో ఉన్న 234 కుటుంబాలను అంధకారంలో నెట్టేశారని, వారు తాగేందుకు నీరు, తినటానికి తిండి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబాలు రోడ్లు ఎక్కి సహాయం కోసం దయనీయంగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. నిర్వాసితుల ఇళ్లు, పొలాలు, ఓట్లు అక్కడే ఉన్నాయని, అటువంటప్పుడు వారు ఏ విధంగా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి అర్హులు కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. చివరిరోజు వరకు వారిని మభ్యపెట్టి మోసం చేశారన్నారు. 2013 ల్యాండ్ అక్విజిషన్ నిబంధనల ప్రకారం తగిన సమయం ఇవ్వకుండా నిర్వాసితులను నడిరోడ్డుపైకి నెట్టడంతోపాటు సుంకేశుల ఎస్సీ కాలనీపై పార్టీ పేరుతో వివక్ష చూపి వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ దక్కనివ్వకపోవడం దారుణమన్నారు. వెంటనే ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే తాటిపర్తి డిమాండ్ చేశారు. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు