నిజామాబాద్ అర్బన్, ఆంధ్రప్రభ: కల్వకుంట్ల కవిత నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పాంచజన్య సంకల్ప సభలో పాల్గొనేందుకు ఆమె పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో తెలంగాణ రక్షణ సేన జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు మాధవ్‌నగర్ సాయిబాబా ఆలయం వద్ద నుంచి ర్యాలీగా నిజామాబాద్ పట్టణానికి బయలుదేరనున్నారు. మాధవ్‌నగర్ నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ పులాంగ్ చౌరస్తా, రాజరాజేంద్ర చౌరస్తా, పెద్దబజార్, నెహ్రూ పార్క్, గాంధీచౌక్, బస్టాండ్ మీదుగా ఓల్డ్ కలెక్టరేట్ మైదానం వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 3.30 నుంచి 3.45 గంటల మధ్య కవిత సభా వేదికకు చేరుకుని పాంచజన్య సంకల్ప సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు నందిపేట మండలం సీహెచ్ కొండూరులోని శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు