Kaizer News

kuppam | భారీ వర్షం…

kuppam | భారీ వర్షం…

· State - Telangana · prabhanews.com

భారీ వర్షం… జిల్లాలో 775.2 మి.మీ. వర్షపాతం నమోదు కుప్పంలో అత్యధికంగా 112.2 మి.మీ. kuppam | చిత్తూరు, సెప్టెంబర్ 20 (ఆంధ్రప్రభ బ్యూరో) : చిత్తూరు జిల్లాలో శనివారం రాత్రి పలు మండలాల్లో వర్షం కురిసింది. 20వ తేదీన జిల్లావ్యాప్తంగా మొత్తం 775.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. మండలాల సగటు వర్షపాతం 27.7 మి.మీ.గా నమోదైంది. అత్యధికంగా కుప్పం మండలంలో 112.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత పెనుమూరులో 87.0 మి.మీ., గుడుపల్లెలో 77.2 మి.మీ., తవణంపల్లిలో 61.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా రొంపిచెర్లలో 32.2 మి.మీ., పులిచెర్లలో 25.4, వెదురుకుప్పంలో 9.2, నిండ్రలో 0, విజయపురంలో 0, నగరిలో 0, కార్వేటినగరంలో 1.2, పెనుమూరులో 87.0, పూతలపట్టులో 31.2, ఐరాలలో 52.2, పెద్దపంజాణిలో 18.2, గంగవరంలో 11.4, తవణంపల్లిలో 61.2, శ్రీరంగరాజపురంలో 0, గంగాధర నెల్లూరులో 59.0, చిత్తూరు రూరల్‌లో 41.2, పలమనేరులో 10.0, బైరెడ్డిపల్లెలో 20.4, వెంకటగిరికోటలో 8.6, శాంతిపురంలో 24.4, గుడుపల్లెలో 77.2, కుప్పంలో 112.2, రామకుప్పంలో 18.2, బంగారుపాళ్యంలో 20.4, యాదమరిలో 17.0, గుడిపాలలో 5.0, పాలసముద్రంలో 0, చిత్తూరు అర్బన్‌లో 32.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. కుప్పం, పెనుమూరు, గుడుపల్లె, తవణంపల్లి, గంగాధర నెల్లూరు, ఐరాల తదితర మండలాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ వర్షాలు కొంత ఊరటనిచ్చాయి. ఎండిపోతున్న పంటలకు వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్ 20 నాటికి జిల్లాలో 1వ తేదీ నుంచి ఇప్పటివరకు 2,939.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ కాలానికి సాధారణ వర్షపాతం 4,361.6 మి.మీ. కాగా, సాధారణంతో పోలిస్తే 32.6 శాతం లోటు ఉంది. తాజాగా కురిసిన వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో ఉపశమనం లభించినప్పటికీ, జిల్లాలో వర్షాభావ పరిస్థితులు పూర్తిగా తొలగిపోలేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి

Original source: prabhanews.com
Read more on Kaizer News