Kaizer News

విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి

విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి

· State - Telangana · ntnews.com

నాంపల్లి, సెప్టెంబర్ 19 : విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి చెందింది. నాంప‌ల్లి మండ‌లం తుంగపాడు గ్రామంలోని అశోక్ నగర్‌కు చెందిన వడ్లకొండ మల్లయ్యకు చెందిన ఎద్దు గడ్డిమేస్తూ 11 కెవి విద్యుత్ టాన్స్‌ఫార్మ‌ర్‌కి సంబంధించిన వైర్లకు త‌గ‌ల‌డంతో విద్యుత్ షాక్‌కు గురై అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. వ్యవసాయానికి పనికొచ్చే ఎద్దు మృతి చెందడంతో రైతు విలపించాడు. ఎద్దుతో వ్యవసాయం చేసే రైతు త్రీవంగా నష్ట పోయాడని వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని గ్రామ సర్పంచ్ ఎడారి శ్రీశైలం యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు

Original source: ntnews.com
Read more on Kaizer News