Kaizer News

మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇక - బీఆర్ఎస్ బిగ్ డె

మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇక - బీఆర్ఎస్ బిగ్ డెసిషన్..!!

· State - Telangana · telugu.oneindia.com

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దానం నాగేందర్ పైన హై కోర్టు అనర్హత వేటుతో ఒక్క సారిగా కొత్త సమీకరణాలు తెర మీదకు వచ్చాయి. ఖైరతాబాద్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక ఖాయమైంది. దీంతో.. బీఆర్ఎస్ కొత్త వ్యూహం మొదలు పెట్టింది. గ్రేటర్ లో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ఖైరతాబాద్ బై పోల్ ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. దీంతో.. కాంగ్రెస్ పైన ఒత్తిడి పెంచే విధంగా మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. దానం నాగేందర్ పైన అనర్హత వేటుతో బీఆర్ఎస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వం పైన ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన ఇదే తరహా పోరాటానికి సిద్దం అవుతోంది. దీనికి సంబంధించి కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి.. కాంగ్రెస్‌ గూటికి చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యేలందరికీ.. దానం నాగేందర్‌కు పట్టిన గతే పడుతుందని బీఆర్‌ఎస్‌ కేటీఆర్‌ హెచ్చరించారు. 'సత్యమేవ జయతే' అని తన 'ఎక్స్‌' ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేల స్థానాల్లోనూ ఉప ఎన్నికలు వస్తాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ హైకోర్టు దానం నాగేందర్‌పై అనర్హతవేటు విధిస్తూ ఇచ్చినతీర్పు.. రాజ్యాంగం పట్ల అధికార కాంగ్రెస్‌ ద్వంద్వ నీతిని బట్టబయలు చేసిందని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్ధిగా.. తెర పైకి- అక్కడే అసలు ట్విస్ట్ ..!! బీఆర్ఎస్ కొత్త ప్రణాళికలు దానం నాగేందర్ పైన తీర్పు వచ్చిన వెంటనే న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ నేతలు కీలక మంత్రాంగం చేసారు. మిగిలిన ఎమ్మెల్యేల పైనా పార్టీ మారారని నిరూపణకు వీలుగా అన్ని ఆధారాలు సిద్దం చేసుకోవాలని నిర్ణయించారు. వీరి పైనా న్యాయ పరంగా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఈ పరిణామాల పైన స్పందించిన సీనియర్ నేత హరీష్ రావు.. హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్‌ కనీసం ఇప్పుడైనా స్పందించాలని.. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలోకి ఫిరాయించిన ఇతర ఎమ్మెల్యేలందరిపై ఉన్న అనర్హత పిటిషన్ల మీద రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. దేశమంతా తిరిగి తానేదో రాజ్యాంగాన్ని రక్షించే చాంపియన్‌ని అని చెప్పుకొనే రాహుల్‌ గాంధీ కపట నాటకాలు ఈ ఘటనతో బహిర్గతం అయ్యాయని వ్యాఖ్యానించారు. దానం లాగానే పార్టీ ఫిరాయించిన మిగిలిన 8 మంది పైనా అనర్హత వేటు పడే వరకూ పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు

Original source: telugu.oneindia.com
Read more on Kaizer News