Kaizer News

Karimnagar: ఆవారా ప్రసాద్‌ను తెలంగాణ నుంచి బహిష్కర

Karimnagar: ఆవారా ప్రసాద్‌ను తెలంగాణ నుంచి బహిష్కరించాలి: ప్రజామిత్ర డిమాండ్!

· State - Telangana · hmtvlive.com

Shorts కరీంనగర్: ఆవారా ప్రసాద్ ను తెలంగాణ నుంచి బహిష్కరించాలి, అలాగే అంబేద్కర్ పై తీసుక వస్తున్న కల్పిత అక్రమ అవాస్తవ, చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక పుస్తక ప్రచురణ కుట్ర దారులను ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టుకొని కుట్ర దారులపై కేసులు నమోదు చేయాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. కరీంనగర్ లోని కోర్టు వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఒక హిమాలయ శిఖరం అన్నారు. దాన్ని ముట్టుకున్న వాళ్లు దాని కింద సమిధులు అయిపోతారని అన్నారు. అంబేద్కర్ ఒక మహాసముద్రం దాంతో ఆటలు ఆడితే కాలగర్భంలో కలిసిపోతారు. అంబేద్కర్ పై ఎన్ని కుట్రలు చేసిన కుట్రలన్నీ కూడా విఫలం అయిపోతాయని తెలిపారు. కుట్రల సూత్రధారులను, పాత్రధారులను వెంటనే గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు తార్చారం చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. అంబేద్కర్ వాదులు అందరూ మహా పోరాటానికి సిద్ధం కావాలని అయన పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో కొరివి వేణుగోపాల్ , వెన్నం రాజ మల్లయ్య , గజ్జల ఆనందరావు, కొంపల్లి రవీందర్,సిగిరి శ్రీధర్, నల్లాల కనకరాజు, గోస్కి అజయ్, కల్లేపల్లి శంకర్, కుతాడి శివరాజు, కుక్కల లక్ష్మి రాజం, గొర్రె రాజయ్య, గాదం రవి, గండి రాజేశ్వర్, తంగేళ్ళ కిరణ్, తదితర దళిత నాయకులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News