Kaizer News

Nandyal: నంద్యాలలో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు ప్ర

Nandyal: నంద్యాలలో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు ప్రారంభం

· State - Telangana · hmtvlive.com

Shorts నంద్యాల: నంద్యాలలో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రారంభమయ్యాయి.. పట్టణ శివారులోని చెరువు కట్ట వద్ద ఉన్న వినాయక ఘాట్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది.. మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షొరాన్ వినాయకునికి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు.. ప్రోటోకాల్ ప్రకారం కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో ప్రతిష్ఠించిన గణేష్ విగ్రహాలను తొలుత నిమజ్జనం చేశారు.. అనంతరం ఇతర విగ్రహాల నిమజ్జనం ప్రారంభమైంది.. నంద్యాలలో గణేష్ నిమజ్జన సందడి మొదలైంది.. పట్టణ శివారులోని చెన్నై ఎక్స్‌ప్రెస్‌పై ఏర్పాటు చేసిన వినాయక ఘాట్‌కు ఒక్కొక్కటిగా గణేష్ విగ్రహాలు చేరుకుంటున్నాయి. వినాయక ఘాట్‌లో మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షొరాన్ వినాయకునికి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.. అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రోటోకాల్‌లో భాగంగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో ప్రతిష్ఠించిన గణేష్ విగ్రహాలను తొలుత నిమజ్జనం చేశారు.. ఆ తర్వాత పట్టణం, పరిసర ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాల నిమజ్జనం అధికారికంగా ప్రారంభమైంది. నంద్యాల పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 620 గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి గణేష్ విగ్రహాలు ఊరేగింపుగా వినాయక ఘాట్‌కు చేరుకుంటున్నాయి. సాయంత్రం ఐదు గంటల తర్వాత గణేష్ విగ్రహాల శోభాయాత్రలు మరింత ఊపందుకోనున్నాయి.. శోభాయాత్రల అనంతరం వినాయక ఘాట్‌లో నిమజ్జన కార్యక్రమం కొనసాగనుంది. గణేష్ నిమజ్జన వేడుకలు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని మంత్రి ఫరూక్ అన్నారు.. కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసి నిమజ్జన వేడుకలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. పట్టణంలోని ప్రధాన ప్రాంతాలతో పాటు నిమజ్జన మార్గాల్లో పోలీసు బలగాలను మోహరించారు. డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయడంతో పాటు.. జాగిలాలతోనూ తనిఖీలు చేపడుతున్నారు.. భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు..మొత్తంగా నంద్యాలలో గణేష్ నిమజ్జన వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభమయ్యాయి.. సాయంత్రం శోభాయాత్రలతో నిమజ్జన కార్యక్రమం మరింత సందడిగా కొనసాగనుంది

Original source: hmtvlive.com
Read more on Kaizer News